...
...
Next Story

Adilabad RIMS Fire Accident : ఆదిలాబాద్ రిమ్స్‌లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం - ఇద్దరు చిన్నారులు మృతి

Adilabad RIMS Fire Accident : ఆదిలాబాద్‌ రిమ్స్ ఆసుపత్రిలోని చిన్నపిల్లల వార్డులో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా… అప్రమత్తమైన సిబ్బంది మిగతా చిన్నారులను సురక్షితంగా వెలుపలికి తరలించారు.

Published on: Sep 22, 2026, 08:39:47 IST
Advertisement

ఆదిలాబాద్ రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని చిన్నపిల్లల భాగంలో ఒక్కసారిగా చెలరేగిన అగ్నిప్రమాదం కారణంగా ఐదు రోజుల వయసున్న పసికందు ఊపిరాడక, తీవ్ర గాయాల పాలై ప్రాణాలు కోల్పోయింది. అంతేకాకుండా మరో చిన్నారి కూడా మృతి చెందినట్లు తెలిసింది.

ఆదిలాబాద్ రిమ్స్‌లో ఘోర అగ్నిప్రమాదం
ఆదిలాబాద్ రిమ్స్‌లో ఘోర అగ్నిప్రమాదం

ఘటన సమయంలో వార్డులో చికిత్స పొందుతున్న 28 మంది చిన్నారులను ఆసుపత్రి సిబ్బంది, అత్యవసర రక్షణ బృందాలు సకాలంలో స్పందించి సురక్షితంగా బయటకు తరలించడంతో ప్రాణనష్టం తక్కువతో ముగిసింది.

ప్రాథమిక సమాచారం ప్రకారం…. సోమవారం రాత్రి సుమారు 11:50 గంటల సమయంలో చిన్నపిల్లల వార్డులో (NICU/పిడియాట్రిక్ వార్డు) ఉన్న ఎయిర్ కండిషనర్ విభాగంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీ యూనిట్ ఒక్కసారిగా పేలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. క్షణాల వ్యవధిలోనే ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. చిన్నపిల్లలు ప్రాణభయంతో రోదించడం, పొగ కారణంగా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో ఆసుపత్రి ప్రాంగణంలో తీవ్ర భయాందోళనలు, గందరగోళం నెలకొన్నాయి.

ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఒక ఫైర్ ఇంజిన్‌తో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు పక్కనున్న ఇతర వార్డులకు విస్తరించకుండా నిరోధిస్తూ అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అదే సమయంలో ఆసుపత్రి వైద్యులు, పారామెడికల్ సిబ్బంది అప్రమత్తమై వార్డులోని 28 మంది చిన్నారులను సమర్థవంతంగా వెలుపలికి తరలించారు.

పొగ పీల్చడం వల్ల అస్వస్థతకు గురైన పలువురు చిన్నారులను మెరుగైన వైద్యం కోసం సమీపంలోని ఇతర ఆసుపత్రులకు తరలించారు. ప్రమాద తీవ్రతపై సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ లతో పాటు ఉన్నతాధికారులు తెల్లవారుజామునే రిమ్స్ ఆసుపత్రికి చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించడమే కాకుండా ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు, భద్రతా లోపాలపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి, లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. అర్ధరాత్రి వేళ చోటుచేసుకున్న ఈ ప్రమాదంతో పసికందును కోల్పోయిన కంటిపాప తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

సీఎం దిగ్భ్రాంతి…

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks