Hyderabad Crime News : 21 ఏళ్ల నర్సుపై అత్యాచారం...ఆపై హత్య..! కేసులో కీలక విషయాలు
Nurse Rape Murder Case : రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో 21 ఏళ్ల నర్సుపై అత్యాచారం చేయటమే కాకుండా దారుణ హత్యకు పాల్పడ్డిన ఘటన వెలుగు చూసింది. ఈ కేసులో బైక్ మెకానిక్ ఎండీ సనావుల్లాను పహాడీషరీఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Nurse Rape Murder Case : రంగారెడ్డి జిల్లా పరిధిలో నర్సుగా పని చేస్తున్న 21 ఏళ్ల యువతి దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో పోలీసులకు కీలక పురోగతి లభించింది. పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుక్కుగూడ వద్ద జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించి ఎండీ సనావుల్లా (34) అనే బైక్ మెకానిక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

తుక్కుగూడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి నివాస గదిలోకి చొరబడిన నిందితుడు, సుత్తితో సదరు యువతి తలపై తీవ్రంగా కొట్టి…. ఆమెపై లైంగిక దాడికి పాల్పడి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
"21 ఏళ్ల నర్సుపై అత్యాచారం, హత్యకు ఒడిగట్టిన నిందితుడిని మా ప్రత్యేక బృందాలు అదుపులోకి తీసుకున్నాయి. ఈ కేసులోని పూర్తి వివరాలను ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా వెల్లడిస్తాం" అని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
అసలేం జరిగింది…?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన 21 ఏళ్ల యువతి ఏడు నెలల క్రితం హైదరాబాద్‌కు వచ్చి తుక్కుగూడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా చేరింది. ఆసుపత్రి వర్గాలు కేటాయించిన నివాస గదుల్లోనే తన స్నేహితురాలితో కలసి ఆమె నివసిస్తోంది.
శనివారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో, బాధితురాలు ఉదయం నుంచి గది బయటకు రాకపోవడం, ఎంత కొట్టినా తలుపులు తీయకపోవడంతో ఆమె స్నేహితురాలు తోటి సిబ్బందికి సమాచారం ఇచ్చింది. ఆందోళన చెందిన స్నేహితులు కిటికీ గుండా లోపలికి వెళ్లి చూడగా, ముఖంపై తీవ్ర రక్తగాయాలతో ఆమె మంచంపై నిర్జీవంగా పడి ఉంది.
సమాచారం అందుకున్న పహాడీషరీఫ్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. అపరిచిత వ్యక్తులు ఏదో బరువైన వస్తువుతో దాడి చేసి హత్య చేసి ఉంటారని మొదట అనుమానించిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడు బైక్ మెకానిక్ సనావుల్లా అని గుర్తించి శనివారం రాత్రికి అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఉస్మానియా ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత….
ఈ దారుణ ఘటన బయటపడటంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. బాధితురాలి కుటుంబ సభ్యులు, బీజేపీ నాయకులు హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రి పోస్టుమార్టం కేంద్రం వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. బాధితురాలికి న్యాయం చేయాలని, నిందితుడిని కఠినంగా శిక్షించడమే కాకుండా ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు.
"రాఖీ పండగ రోజే ఒక ఆడపిల్లపై ఇంతటి దారుణం జరగడం దురదృష్టకరం. గది కిటికీలు తెరిచి లోపలికి చొరబడిన నిందితుడు సుత్తితో తలపై బాది, లైంగిక దాడికి పాల్పడి హత్య చేశాడు. ఈ ప్రాంతంలో శాంతిభద్రతల పరిస్థితిపై గతంలోనే హైదరాబాద్ సీపీ వి.సి.సజ్జనార్‌కు కూడా ఫిర్యాదు చేశాం. ఈ కేసులో స్థానిక ఇన్ స్పెక్టర్ ఏం చేస్తున్నారు?" అని బీజేపీ నాయకుడు అందెల శ్రీరాములు యాదవ్ ప్రశ్నించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

