Salman Khan: ఏసుక్రీస్తు ఫొటో ముందు ముస్లిం అన్న సల్మాన్ ఖాన్‌కు రాఖీ కట్టిన హిందూ చెల్లెలు అర్పిత.. ఫ్యాన్స్ ఫిదా
Salman Khan: సల్మాన్ ఖాన్ చెల్లెలు అర్పితా ఖాన్ అతనికి బొట్టు పెట్టి రాఖీ కడుతున్న వీడియో వైరల్ అవుతోంది. అందులో ఈ ఇద్దరి వెనుక ఏసుక్రీస్తు ఫొటో ఉండటమే దీనికి కారణం. ఇది పూర్తి సెక్యులర్ ఫొటో అని కామెంట్స్ వస్తున్నాయి.
Salman Khan: రాఖీ పండుగ వేళ బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ తన చెల్లెలు అర్పితా ఖాన్ శర్మతో జరుపుకున్న రక్షా బంధన్ వేడుకల వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఫొటోగ్రాఫర్ల ముందు తన చేతికి ఉన్న రాఖీలను గర్వంగా చూపించిన సల్మాన్.. కుటుంబ సభ్యులతో కలిసి ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. అయితే ఈ వీడియోలో నెటిజన్ల దృష్టిని ఆకర్షించిన అసలు విషయం వెనుక ఉన్న ఒక ఫొటోనే.

"మోస్ట్ సెక్యులర్ వీడియో".. సోషల్ మీడియాలో వైరల్ టాపిక్
అర్పితా ఖాన్ పోస్ట్ చేసిన ఈ ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో.. ఆమె సల్మాన్‌కు హారతి ఇచ్చి మురిపెంగా రాఖీ కడుతుండగా భాయిజాన్ నవ్వుతూ కనిపించారు. అయితే వారి వెనుక గోడపై ఏసుక్రీస్తు లాస్ట్ సప్పర్ (The Last Supper) పెయింటింగ్ స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ ఫొటో చూసిన నెటిజన్లు ఎక్స్, రెడిట్‌లలో విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు. "ఒక ముస్లిం అమ్మాయి (అర్పితా), హిందూ భర్తను (ఆయుష్ శర్మ) పెళ్లి చేసుకుని, తన ముస్లిం సోదరుడికి (సల్మాన్) రాఖీ కడుతుంటే, వెనుక ఏసుక్రీస్తు ఫొటో ఉండటం ఈరోజు ఇంటర్నెట్‌లో చూసిన అత్యంత సెక్యులర్ వీడియో" అంటూ ఒక నెటిజన్ రాసుకొచ్చారు.
గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో పండుగల సందడి
సల్మాన్ ఖాన్ ఇంట్లో ప్రతి ఏటా గణేష్ చతుర్థి, ఈద్, దీపావళి, రాఖీ వేడుకలు చాలా గ్రాండ్‌గా జరుగుతుంటాయి. ఈసారి కూడా అర్పిత కుమార్తె ఆయత్ తన అన్నలు అర్హాన్ ఖాన్, నిర్వాణ్ ఖాన్, అయాన్ అగ్నిహోత్రిలకు రాఖీలు కట్టి సందడి చేసింది.
ఖాన్ ఫ్యామిలీలో సల్మాన్, అర్బాజ్, సోహైల్, అల్విరా, అర్పితా అని ఐదుగురు తోబుట్టువులు ఉన్నారు. ఎంత ఎదిగినా ఈ ఫ్యామిలీ బాండింగ్ ఎప్పుడూ ఒకేలా ఉంటుందని, మతాలకు అతీతంగా వీళ్లు జరుపుకునే పండుగలు భారత్ సమగ్రతకు నిదర్శనమని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
సౌదీ మూవీ నుంచి 'మాతృభూమి' వరకు.. సల్మాన్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్
సల్మాన్ ఖాన్ రీసెంట్‌గా హాలీవుడ్ స్టార్ మోనికా బెలూచితో కలిసి నటించిన '7 డాగ్స్' అనే సౌదీ ప్రొడక్షన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఆయన లైనప్‌లో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి.
దర్శకుడు అపూర్వ లఖియా డైరెక్షన్ లో 'మాతృభూమి' అనే ఇంటెన్స్ యాక్షన్ డ్రామాలో సల్మాన్ నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన సరసన చిత్రంగద సింగ్ నటిస్తుండగా, త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నారు.
ఇక ఇదే కాకుండా వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో నయనతారతోనూ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ వచ్చే ఏడాది రంజాన్ కు రిలీజ్ కానుంది.
అర్పితా ఖాన్ ఎవరు?
అర్పితా ఖాన్ సల్మాన్ ఖాన్ సొంత చెల్లెలు కాదు. ఆమెను సల్మాన్ దత్తత తీసుకున్నాడు. సల్మాన్ తండ్రి, స్క్రీన్ రైటర్ అయిన సలీమ్ ఖాన్, నటి హెలెన్ కూతురు ఈ అర్పిత. ఆమెను చిన్నతనంలోనే సల్మాన్ దత్తత తీసుకున్నాడు. 2014లో మన హైదరాబాద్ లోని ఫలక్‌నుమా ప్యాలెస్ లోనే అంగరంగ వైభవంగా ఆమె పెళ్లి చేశాడు సల్మాన్.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


