The Monster: సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి మూవీకి క్రేజీ టైటిల్.. మాన్‌స్టర్‌లా వస్తున్న బాలీవుడ్ భాయ్
The Monster: సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి, నయనతార, దిల్ రాజు కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు ది మాన్‌స్టర్ అనే క్రేజీ టైటిల్ పెట్టారు. ఈ సినిమా వచ్చే ఏడాది రంజాన్ కు రిలీజ్ కానుంది. సికందర్ ఫ్లాప్ తర్వాత సల్మాన్ నటిస్తున్న మూవీ ఇది.
The Monster: బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్, టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కి సంబంధించిన సంచలన అప్‌డేట్ బయటికొచ్చింది. డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు మేకర్స్ ‘ది మాన్‌స్టర్’ (The Monster) అనే క్రేజీ టైటిల్‌ను లాక్ చేశారు.

ఇంకా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాకపోయినప్పటికీ ప్రొడక్షన్ వర్గాల్లో ఈ టైటిల్ దాదాపు ఖాయమైపోయింది. సల్మాన్ ఖాన్ సరసన సౌత్ లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఈద్ 2027 కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.
వంశీ పైడిపల్లి బాలీవుడ్ ఎంట్రీ.. భారీ స్కేల్‌లో మాస్ యాక్షన్
టాలీవుడ్‌లో 'బృందావనం', 'ఎవడు', నాగార్జున-కార్తీల 'ఊపిరి', మహేష్ బాబుతో నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ 'మహర్షి', విజయ్‌తో 'వారిసు' లాంటి బ్లాక్‌బస్టర్లు తీసిన వంశీ పైడిపల్లికి ఇది మొదటి హిందీ సినిమా. సౌత్ అండ్ నార్త్ ఆడియెన్స్ మైండ్ సెట్‌ను పర్ఫెక్ట్‌గా రీడ్ చేయగల ఆయన.. ఈ సినిమాను పూర్తి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో డిజైన్ చేస్తున్నారు.
మరోవైపు ప్రొడ్యూసర్ దిల్ రాజు సౌత్ నుంచి పాన్ ఇండియా మార్కెట్‌లోకి రీసెంట్‌గా ఎంట్రీ ఇచ్చి తన పరిధిని విస్తరిస్తున్నారు. గ్లోబల్ వైడ్‌గా భారీ స్థాయిలో బిజినెస్ రీచ్ సాధించాలనే టార్గెట్‌తో ఈ 'ది మాన్‌స్టర్' ప్రాజెక్ట్‌పై ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా వందల కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నారు. అక్టోబర్ నాటికి షూటింగ్ పూర్తి చేసి, ఆ తర్వాత వీఎఫ్‌ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ప్రారంభించనున్నారు.
సల్మాన్ ఖాన్ - నయనతార కాంబో.. 'జవాన్' క్రేజ్ రిపీట్?
సల్మాన్ ఖాన్‌కి ఈద్ సీజన్ ఎంత స్పెషల్ అనేది వేరే చెప్పక్కర్లేదు. ఆయన కెరీర్‌లోని అతిపెద్ద హిట్స్ అన్నీ ఈద్ పండుగకే బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. ‘సికందర్’ తర్వాత సల్మాన్ నటిస్తున్న ఈ పాన్ ఇండియా యాక్షన్ డ్రామాపై బాలీవుడ్ వర్గాల్లో మైండ్ బ్లాకింగ్ అంచనాలు ఉన్నాయి.
షారుఖ్ ఖాన్ ‘జవాన్’ మూవీతో ఆల్రెడీ నార్త్‌లో జెండా పాతేసిన నయనతార.. ఇప్పుడు సల్మాన్ ఖాన్‌తో కలిసి జోడీ కడుతుండటంతో అటు టాలీవుడ్, ఇటు బాలీవుడ్‌లో ఈ కాంబో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో సల్మాన్ క్యారెక్టర్ చాలా పవర్‌ఫుల్‌గా, డార్క్ షేడ్స్‌తో ఉండబోతోందని తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సైలెంట్‌గా శరవేగంగా జరుగుతోంది. టైటిల్ ఫస్ట్ లుక్ లేదా గ్లింప్స్‌ను త్వరలోనే గ్రాండ్‌గా అనౌన్స్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈద్ 2027 నాటికి బాక్సాఫీస్ వద్ద ఈ 'మాన్స్టర్' ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


