'రైతుబీమా' ప్రాసెస్ చేయడానికి లంచం డిమాండ్ - ఏసీబీకి దొరికిపోయిన ఏఈవో

మహబూబాబాద్ జిల్లాలో వ్యవసాయ విస్తరణ అధికారి ఏసీబీకి చిక్కాడు. రైతు బీమా దరఖాస్తును ప్రాసెస్ చేసేందుకు లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డాడు. కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 

Published on: Nov 6, 2025, 21:47:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గత కొంతకాలంగా అవినీతి అధికారులు భరతం పడుతోంది తెలంగాణ ఏసీబీ. పక్కా సమాచారంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటోంది. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో వ్యవసాయ విస్తరణ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న సందీప్ ఏసీబీకి చిక్కాడు. రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డాడు.

ఏసీబీకి చిక్కిన  జి. సందీప్
ఏసీబీకి చిక్కిన జి. సందీప్

రూ. 10 వేలు లంచం డిమాండ్….

ఏసీబీ విడుదల చేసిన ప్రకటనలోని వివరాల ప్రకారం…. రైతుబీమా కోసం చనిపోయిన రైతు కుమారుడు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ దరఖాస్తును ప్రాసెస్ చేసి… ఉన్నతాధికారుల ఆమోదం కోసం పంపించడానికి మర్రిపెడ మండలంలో వ్యవసాయ విస్తరణ అధికారిగా పని చేస్తున్న జి. సందీప్రూ . 10 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో దరఖాస్తుదారుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

పక్కాగా ప్లాన్ చేసిన ఏసీబీ అధికారులు ఫిర్యాదుదారుడి నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా సందీప్ ను పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఏ ప్రభుత్వాధికారి అయినా లంచం అడిగితే ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు. అవినీతి నిరోధక శాఖ "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని తెలిపారు. అంతే కాకుండా వివిధ సామాజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106), ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) లేదా వెబ్ సైట్ ( https://acb.telangana.gov.in ) ద్వారా కూడా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుల సమాచారం గోప్యంగా ఉంచుతామని వివరించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More