బిల్లు ప్రాసెస్ చేయడానికి రూ. 1.90 లక్షల లంచం డిమాండ్ - ఏసీబీకి దొరికిపోయిన యాదాద్రి ఆలయ అధికారి

యాదగిరిగుట్ట ఆలయ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్ ఇంజినీర్ వెంకట రామారావు ఏసీబీకి చిక్కాడు. ఆహార యంత్రాల ఏర్పాటుకు సంబంధించిన బిల్లు మొత్తాన్ని ప్రాసెస్ చేయడానికి రూ. రూ.1,90,000 తీసుకుంటుండగా పట్టుబడ్డాడు. కేసు నమోదు కాగా… దర్యాప్తు కొనసాగుతోంది.

Published on: Oct 30, 2025, 16:22:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గత కొంతకాలంగా అవినీతి అధికారుల విషయంలో తెలంగాణ ఏసీబీ దూకుడుగా ముందుకెళ్తోంది. ఇటీవలే కాలంలో చాలా మంది అధికారులు పట్టుబడిన ఘటనలు వెలుగు చూశాయి. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట ఆలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ అధికారులు ఏసీబీకి చిక్కాడు.

ఏసీబీకి చిక్కిన వూడెపు వెంకట రామారావు
ఏసీబీకి చిక్కిన వూడెపు వెంకట రామారావు

రూ. 1.90 లక్షల లంచం డిమాండ్..

ఏసీబీ విడుదల చేసిన ప్రకటనలోని వివరాల ప్రకారం…. యాదగిరిగుట్టలో గల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఆహార యంత్రాల ఏర్పాటుకు సంబంధించిన రూ.11,50,445 బిల్లును ప్రాసెస్ చేయడానికి దరఖాస్తు వచ్చింది. ఈ మొత్తాన్ని ప్రాసెస్ చేయడానికి అసిస్టెంట్ ఇంజినీర్, ఇంచార్జ్ సూపరింటిండింగ్ ఇంజినీరుగా ఉన్న వూడెపు వెంకట రామారావు. రూ. రూ.1,90,000 లంచం డిమాండ్ చేశాడు. దీంతో సదరు వ్యక్తి… ఏసీబీని ఆశ్రయించాడు.

ఏసీబీ అధికారులకు ఫిర్యాదు అందటంతో పక్కాగా రంగంలోకి దిగారు. ఫిర్యాదుదారుడి నుంచి వెంకట రామారావు రూ.1,90,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కేసు నమోదు కాగా దర్యాప్తు చేస్తున్నారు.

ఏ ప్రభుత్వాధికారి అయినా లంచం అడిగితే ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు. అవినీతి నిరోధక శాఖ "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని తెలిపారు. అంతే కాకుండా వివిధ సామాజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106), ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) లేదా వెబ్ సైట్ ( https://acb.telangana.gov.in ) ద్వారా కూడా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుల సమాచారం గోప్యంగా ఉంచుతామని వివరించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More