బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి ఏఐబీఈ -20 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కూడా కొనసాగుతోంది. అయితే ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం… రిజిస్ట్రేషన్ల గడువు అక్టోబర్ 28వ తేదీతో ముగిసింది. ఈ నేపథ్యంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మరో అప్డేట్ ఇచ్చింది. రిజిస్ట్రేషన్ల గడువును అక్టోబర్ 31వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

ఎల్ఎల్ బీ పూర్తి చేసిన వారితో పాటు ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు కూడా ఈ పరీక్షను రాయవచ్చు. అర్హత ఉన్న అభ్యర్థులు allindiabarexamination.com వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
నవంబర్ 30న ఎగ్జామ్....
ఇక అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ గడువును కూడా పొడిగించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏమైనా తప్పులు ఉంటే… నవంబర్ 1వ తేదీ వరకు సరిచేసుకోవచ్చు. నవంబర్ 15వ తేదీన హాల్ టికెట్లను విడుదల చేస్తారు. నవంబర్ 30వ తేదీన ఈ ఎగ్జామ్ నిర్వహిస్తారు. తెలంగాణతో పాటు ఏపీలోనూ పరీక్షా కేంద్రాలుంటాయి.
ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ అనేది న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించాలనుకునే లా గ్రాడ్యుయేట్ల కోసం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంవత్సరానికి రెండుసార్లు సర్టిఫికేషన్ పరీక్షను నిర్వహిస్తుంది. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ అందజేస్తుంది.
AIBE 20 ఎగ్జామ్: అప్లికేషన్ ప్రాసెస్ ఇలా....
- ముందుగా ఏఐబీఈ 20 కోసం https://www.allindiabarexamination.com/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- ముందుగా ప్రాథమిక వివరాలతో లాగిన్ కావాలి.
- హోమ్ పేజీలో, ఏఐబీఈ 20 కోసం రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేయాలి.
- ముందుగా నిర్ణయించిన ఫీజును చెల్లించాలి.
- అవసరమైన వివరాలను నమోదు చేసి ద్వారా అప్లికేషన్ ఫారమ్ పూర్తి చేయాలి.
- చివరగా సబ్మిట్ చేస్తే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.
ఇక ఆలిండియా బార్ ఎగ్జామినేషన్లో ఉత్తీర్ణత సాధించాలంటే జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు కనీసం 45 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులు పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి కనీస మార్కులు 40 శాతంగా ఉంది. మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
{{/usCountry}}ఇక ఆలిండియా బార్ ఎగ్జామినేషన్లో ఉత్తీర్ణత సాధించాలంటే జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు కనీసం 45 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులు పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి కనీస మార్కులు 40 శాతంగా ఉంది. మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
{{/usCountry}}దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.3500 చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.2500గా ఉంటుంది. కేవలం ఆన్ లైన్ ద్వారానే ఈ చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేయాలి.