AIIMS Bibinagar OP Booking : ఎయిమ్స్ బీబీనగర్ నుంచి గుడ్ న్యూస్ - ఫోన్ నుంచే ఓపీ రిజిస్ట్రేషన్లు, UPI సేవలు కూడా…
AIIMS Bibinagar OPD Booking : బీబీనగర్ ఎయిమ్స్ రోగుల సౌకర్యార్థం 'AIIMS Bibinagar Swasthya' యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ఫోన్ నుంచే ఓపీ అపాయింట్‌మెంట్‌లు బుక్ చేసుకోవచ్చు, రిపోర్టులు పొందవచ్చు.
AIIMS Bibinagar OPD Booking : యాదాద్రి భువనగిరి జిల్లాలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (AIIMS) బీబీనగర్ హాస్పిటల్‌కు వచ్చే రోగులు, వారి సహాయకులకు ఆసుపత్రి యాజమాన్యం తీపి కబురు అందించింది. రోజురోజుకూ పెరుగుతున్న రోగుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, వైద్య సేవలను మరింత వేగంగా మరియు సులభంగా అందించేందుకు ప్రత్యేకంగా 'AIIMS Bibinagar Swasthya' పేరుతో మొబైల్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈజీగా ఓపీ రిజిస్ట్రేషన్లు…
ఇప్పటివరకు ఆసుపత్రికి వెళ్లే రోగులు ఓపీడీ (OPD) రిజిస్ట్రేషన్ టోకెన్ల కోసం, రక్త పరీక్షలు మరియు ఇతర ల్యాబ్ పరీక్షల ఫీజులు చెల్లించడానికి క్యూ లైన్లలో గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. ఈ సరికొత్త డిజిటల్ యాప్ అందుబాటులోకి రావడంతో రోగులకు ఆ తిప్పలు పూర్తిగా తప్పనున్నాయి.
ఈ యాప్ సహాయంతో బాధితులు తమ ఇళ్ల నుంచే నేరుగా వేర్వేరు విభాగాల వైద్యుల అపాయింట్‌మెంట్‌లను ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. దీనివల్ల ఆసుపత్రి వద్ద వేచి ఉండే సమయం గణనీయంగా తగ్గుతుంది. అంతేకాకుండా, డాక్టర్లు సూచించిన వివిధ వైద్య పరీక్షలకు సంబంధించిన ఫీజులను కూడా యూపీఐ , నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా సులభంగా చెల్లించే సదుపాయాన్ని అందులో పొందుపరిచారు.
పరీక్షలు పూర్తయిన తర్వాత ల్యాబ్ రిపోర్టుల కోసం మళ్లీ ఆసుపత్రి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, నేరుగా మీ మొబైల్ ఫోన్‌లోనే 'ఎయిమ్స్ బీబీ నగర్ Swasthya' యాప్ ద్వారా రిపోర్టులను వీక్షించవచ్చు, డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఈ అత్యాధునిక డిజిటల్ సేవలను ఉపయోగించుకోవడానికి సంబంధిత యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని ఎయిమ్స్ బీబీనగర్ యంత్రాంగం ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

