భారతీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త సునీల్ భారతీ మిట్టల్ హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్ బోధి పవిలియన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు, డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా సాగిన ఈ ఉన్నత స్థాయి భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రగతిశీల పాలన, పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు, చారిత్రాత్మక సంస్కరణల వల్ల దేశంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన పెట్టుబడి గమ్యస్థానంగా రాష్ట్రం అవతరించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒక భారీ, సమగ్ర డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మౌలిక సదుపాయాల క్యాంపస్‌ను ఏర్పాటు చేసే అవకాశాలను తెలంగాణ అన్వేషిస్తోందన్నారు.
రాష్ట్ర విద్యా రంగంలో ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను సీఎం ఈ సందర్భంగా వివరించారు. ప్రభుత్వ పాఠశాలల సమగ్ర రూపాంతరంతో పాటు యువతకు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు 'యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ'ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే ఐటీఐలను (ITIs) అంతర్జాతీయ స్థాయి 'అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు'గా అప్‌గ్రేడ్ చేయడం, పాలిటెక్నిక్ కళాశాలల ఆధునీకరణ గురించి సునీల్ మిట్టల్‌కు వివరించారు.
తెలంగాణను డిజిటల్ మౌలిక సదుపాయాలకు గ్లోబల్ హబ్‌గా మార్చాలనే విజన్‌ను చెబుతూ.. చందన్‌వెల్లి డేటా సెంటర్ ప్రాజెక్ట్ అమలును వేగవంతం చేయాలని సీఎం.. భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ను కోరారు. అంతేకాకుండా రాష్ట్రంలో భారీ ఎత్తున ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్‌ను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని ఆహ్వానించారు. హైదరాబాద్‌లో ఎయిర్‌టెల్ తన డిజిటల్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ కార్యకలాపాలను మరింత విస్తరించాలని, భవిష్యత్ పెట్టుబడుల సమన్వయం కోసం ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ను నియమించాలని సీఎం సూచించారు.
తెలంగాణ ప్రభుత్వ ముందుచూపుతో కూడిన నిర్ణయాలను సునీల్ భారతీ మిట్టల్ అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలు, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లలో చదువుకునే విద్యార్థులకు భారతీ ఎయిర్‌టెల్ ఫౌండేషన్ ద్వారా స్కాలర్షిప్లు అందజేస్తామని ప్రకటించారు.
{{/usCountry}}తెలంగాణ ప్రభుత్వ ముందుచూపుతో కూడిన నిర్ణయాలను సునీల్ భారతీ మిట్టల్ అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలు, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లలో చదువుకునే విద్యార్థులకు భారతీ ఎయిర్‌టెల్ ఫౌండేషన్ ద్వారా స్కాలర్షిప్లు అందజేస్తామని ప్రకటించారు.
{{/usCountry}}అంతేకాకుండా అత్యంత కీలకమైన విషయంగా.. హైదరాబాద్ నగరాన్ని ఎయిర్‌టెల్ సంస్థ రెండవ ప్రధాన కార్యాలయంగా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు ముఖ్యమంత్రికి తెలిపారు. తెలంగాణలో డేటా సెంటర్ సామర్థ్యాన్ని విస్తరించడానికి, రాష్ట్రవ్యాప్తంగా ఫైబర్ కనెక్టివిటీని బలోపేతం చేయడానికి భారతీ ఎంటర్‌ప్రైజెస్ కట్టుబడి ఉందని మిట్టల్ స్పష్టం చేశారు.