తెలంగాణలో ఎయిర్‌టెల్ రెండో ప్రధాన కార్యాలయం.. సీఎం రేవంత్ రెడ్డితో సునీల్ మిట్టల్ భేటీ!
ఎయిర్‌టెల్‌కు హైదరాబాద్‌ను రెండో ప్రధాన కార్యాలయంగా భారతీ గ్రూప్ పరిశీలిస్తోందని మిట్టల్ తెలిపారు. అలాగే రాష్ట్రంలో తమ డేటా సెంటర్ సామర్థ్యాన్ని విస్తరించడానికి, ఫైబర్ కనెక్టివిటీ నెట్‌వర్క్‌ను విస్తృతం చేయడానికి అవసరమైన ప్రణాళికలతో ముందుకు వెళ్తామని ఆయన ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు.
భారతీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త సునీల్ భారతీ మిట్టల్ హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్ బోధి పవిలియన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు, డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా సాగిన ఈ ఉన్నత స్థాయి భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రగతిశీల పాలన, పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు, చారిత్రాత్మక సంస్కరణల వల్ల దేశంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన పెట్టుబడి గమ్యస్థానంగా రాష్ట్రం అవతరించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒక భారీ, సమగ్ర డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మౌలిక సదుపాయాల క్యాంపస్‌ను ఏర్పాటు చేసే అవకాశాలను తెలంగాణ అన్వేషిస్తోందన్నారు.
రాష్ట్ర విద్యా రంగంలో ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను సీఎం ఈ సందర్భంగా వివరించారు. ప్రభుత్వ పాఠశాలల సమగ్ర రూపాంతరంతో పాటు యువతకు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు 'యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ'ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే ఐటీఐలను (ITIs) అంతర్జాతీయ స్థాయి 'అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు'గా అప్‌గ్రేడ్ చేయడం, పాలిటెక్నిక్ కళాశాలల ఆధునీకరణ గురించి సునీల్ మిట్టల్‌కు వివరించారు.
తెలంగాణను డిజిటల్ మౌలిక సదుపాయాలకు గ్లోబల్ హబ్‌గా మార్చాలనే విజన్‌ను చెబుతూ.. చందన్‌వెల్లి డేటా సెంటర్ ప్రాజెక్ట్ అమలును వేగవంతం చేయాలని సీఎం.. భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ను కోరారు. అంతేకాకుండా రాష్ట్రంలో భారీ ఎత్తున ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్‌ను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని ఆహ్వానించారు. హైదరాబాద్‌లో ఎయిర్‌టెల్ తన డిజిటల్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ కార్యకలాపాలను మరింత విస్తరించాలని, భవిష్యత్ పెట్టుబడుల సమన్వయం కోసం ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ను నియమించాలని సీఎం సూచించారు.
తెలంగాణ ప్రభుత్వ ముందుచూపుతో కూడిన నిర్ణయాలను సునీల్ భారతీ మిట్టల్ అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలు, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లలో చదువుకునే విద్యార్థులకు భారతీ ఎయిర్‌టెల్ ఫౌండేషన్ ద్వారా స్కాలర్‌షిప్‌లు అందజేస్తామని ప్రకటించారు.
అంతేకాకుండా అత్యంత కీలకమైన విషయంగా.. హైదరాబాద్ నగరాన్ని ఎయిర్‌టెల్ సంస్థ రెండవ ప్రధాన కార్యాలయంగా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు ముఖ్యమంత్రికి తెలిపారు. తెలంగాణలో డేటా సెంటర్ సామర్థ్యాన్ని విస్తరించడానికి, రాష్ట్రవ్యాప్తంగా ఫైబర్ కనెక్టివిటీని బలోపేతం చేయడానికి భారతీ ఎంటర్‌ప్రైజెస్ కట్టుబడి ఉందని మిట్టల్ స్పష్టం చేశారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


