MMTS trains Cancelled : ప్రయాణికులకు అలర్ట్ - నేడు, రేపు పలు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు… పూర్తి జాబితా ఇదే!
Hyderabad MMTS trains cancelled : నిర్వహణ కారణాలతో హైదరాబాద్ నగరంలో మే 11,12 తేదీల్లో పలు ఎంఎంటీఎస్ (MMTS) రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
Hyderabad MMTS trains cancelled : హైదరాబాద్ నగరంలో ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణించే వారికి దక్షిణ మధ్య రైల్వే ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. వివిధ నిర్వహణ సంబంధిత కారణాలతో మే 11 (నేడు), మే 12 (రేపు) తేదీల్లో నగరంలోని పలు ఎంఎంటీఎస్ సర్వీసులను పూర్తిగా రద్జు చేసింది. పాక్షికంగా మరికొన్నింటిని రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.
పూర్తిగా రద్దయిన రైళ్లు:
- ఉమ్దానగర్ – లింగంపల్లి (ట్రైన్ నెం. 47164)
- లింగంపల్లి – ఫలక్ నుమా (ట్రైన్ నెం. 47191)
- ఫలక్ నుమా – లింగంపల్లి (ట్రైన్ నెం. 47170)
- ఫలక్ నుమా – ఉమ్దానగర్ (ట్రైన్ నెం. 47250)
పాక్షికంగా రద్దయిన రైళ్లు :
రైల్వే ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా కొన్ని రైళ్లను నిర్ణీత స్టేషన్ల మధ్య నిలిపివేశారు.
- లింగంపల్లి – ఉమ్దానగర్ (47210): సికింద్రాబాద్ - ఉమ్దానగర్ మధ్య పాక్షికంగా రద్దు చేయబడింది.
- ఉమ్దానగర్ – లింగంపల్లి (47203): ఉమ్దానగర్ - సికింద్రాబాద్ మధ్య రద్దయింది.
- ఫలక్ నుమా – లింగంపల్లి (47157, 47166): ఈ రైళ్లు ఫలక్ నుమా - సికింద్రాబాద్ స్టేషన్ల మధ్య నడవవు.
- లింగంపల్లి – ఫలక్ నుమా (47179, 47190, 47187): ఈ సర్వీసులు సికింద్రాబాద్ - ఫలక్ నుమా మధ్య పాక్షికంగా నిలిపివేయబడ్డాయి.
నగరంలోని ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, సామాన్య ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ముందుగానే తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. రైల్వే కార్యకలాపాల సౌలభ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

