తెలంగాణలో వివిధ ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల సిలబస్ మార్పులపై వస్తున్న ఊహాగానాలకు, విజ్ఞప్తులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) చెక్ పెట్టింది. పలు ఉద్యోగ నియామకాలకు సంబంధించి సిలబస్ సవరణలపై అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున విన్నపాలు, విచారణలు వస్తుండటంతో స్పష్టతనిస్తూ టీజీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది.

వివిధ ఉద్యోగ పరీక్షల సిలబస్‌ను మార్చేందుకు టీజీపీఎస్సీ ఎలాంటి ప్రత్యేక సిలబస్ కమిటీని ఏర్పాటు చేయలేదని టీజీపీఎస్సీ తేల్చిచెప్పింది. నియామక పరీక్షల సిలబస్‌లో ఏవైనా పెద్ద ఎత్తున మార్పులు చేయాల్సి వస్తే, ఆ వివరాలను కనీసం ఒక సంవత్సరం ముందే అభ్యర్థులకు ముందస్తుగా తెలియజేస్తామని కమిషన్ స్పష్టం చేసింది.
ఒకవేళ సిలబస్‌లో చాలా స్వల్పమైన మార్పులు ఉంటే.. ఆ వివరాలను సంబంధిత ఉద్యోగ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌తో పాటే విడుదల చేస్తామని పేర్కొంది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలోనూ, పలు అభ్యర్థుల వర్గాల్లోనూ టీజీపీఎస్సీ పరీక్షల సిలబస్ మారుతోందనే వార్తలు విస్తృతంగా ప్రచారం అయ్యాయి. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 వంటి కీలకమైన పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులు ఈ ప్రచారంతో కొంత అయోమయానికి గురయ్యారు. కమిషన్ స్పందించి ముందస్తుగా ప్రకటన చేయడంతో పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థులకు పెద్ద ఊరట లభించింది.
సామాజిక మాధ్యమాల్లో వచ్చే అనధికారిక వార్తలను, ఊహాగానాలను నమ్మవద్దని అధికార యంత్రాంగం కోరింది. సిలబస్, నోటిఫికేషన్లు, పరీక్షల తేదీలకు సంబంధించిన అధికారిక సమాచారం కోసం అభ్యర్థులు క్రమం తప్పకుండా టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.in ను మాత్రమే పరిశీలించాలని సూచించారు.
టీజీపీఎస్సీ జాబ్ నోటిఫికేషన్
హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డులో ఖాళీగా ఉన్న 130 మేనేజర్ (ఇంజినీరింగ్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది టీజీపీఎస్సీ. ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం. ఈ పోస్టులకు అర్హత ఉన్న అభ్యర్థులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ https://www.tgpsc.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
{{/usCountry}}హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డులో ఖాళీగా ఉన్న 130 మేనేజర్ (ఇంజినీరింగ్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది టీజీపీఎస్సీ. ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం. ఈ పోస్టులకు అర్హత ఉన్న అభ్యర్థులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ https://www.tgpsc.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
{{/usCountry}}ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం సెప్టెంబర్ 23, 2026 నుంచి అక్టోబర్ 17 వరకు ఉంటుంది. 2026 డిసెంబరు నెలలో రాత పరీక్షలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు TGPSC తాత్కాలిక షెడ్యూల్‌లో పేర్కొంది. ఈ పోస్టులన్నీ మల్టీజోన్-2 పరిధిలోకి వస్తాయి. 2026 జూలై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 54,220 నుంచి రూ. 1,33,630 వరకు వేతన స్కేలు లభిస్తుంది. పూర్తి వివరాల కోసం కింది వార్తను చదవండి
టీజీపీఎస్సీ నుంచి శుభవార్త - 130 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ముఖ్య తేదీలివే