ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో ఉద్యోగ ప్రకటన.. 1,156 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ నుంచి ఉద్యోగ ప్రకటన వెలువడింది. 1,156 పోస్టులు ఉన్నట్టుగా నోటిఫికేషన్ వెలువడింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (SLPRB, AP) పోలీస్, అగ్నిమాపక, జైళ్ల శాఖల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 1,156 ఖాళీల వివరాలు కింది విధంగా ఉన్నాయి.

పోస్టుల వివరాలు, ఖాళీలు
స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) పోలీస్ కానిస్టేబుల్స్ (సివిల్ - పురుషులు/మహిళలు): 542 పోస్టులు
స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) పోలీస్ కానిస్టేబుల్స్ (AR - పురుషులు/మహిళలు): 285 పోస్టులు
ఫైర్‌మెన్ (SDR & ఫైర్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ - పురుషులు): 158 పోస్టులు
వార్డర్లు (జైళ్ల శాఖ - పురుషులు): 150 పోస్టులు
వార్డర్లు (జైళ్ల శాఖ - మహిళలు): 21 పోస్టులు
అర్హతలు, వయోపరిమితి
జూలై 1, 2026 నాటికి అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. SC, ST అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణులై, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు హాజరై ఉంటే సరిపోతుంది. అభ్యర్థులకు తగిన శారీరక ప్రమాణాలు మరియు వైద్య ప్రమాణాలు (రెండు కళ్లలోనూ 6/6 దృష్టి) ఉండాలి.
పోస్ట్ కోడ్‌లు 21, 22: జనరల్ అభ్యర్థుల వయస్సు 18 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి (02-07-2002 నుండి 01-07-2008 మధ్య జన్మించి ఉండాలి).
పోస్ట్ కోడ్‌లు 42, 53, 54 (మరియు హోం గార్డులు): వయస్సు 18 నుండి 32 సంవత్సరాల మధ్య ఉండాలి (02-07-1994 నుండి 01-07-2008 మధ్య జన్మించి ఉండాలి).
EWS, BC, SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాల వరకు వయోసడలింపు ఉంటుంది. అలాగే మాజీ సైనికులు, ప్రభుత్వ ఉద్యోగులు, NCC ఇన్‌స్ట్రక్టర్లు, విడో/విడాకులు తీసుకున్న మహిళలకు నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది.
జీతం, ఎంపిక విధానం
జీతం నెలకు రూ. 25,220 నుండి రూ. 80,910 వరకు ఉంటుంది. పోస్టుల ఎంపిక ప్రక్రియ ఐదు దశల్లో జరుగుతుంది. ప్రాథమిక రాత పరీక్ష (ప్రైమరీ రిటన్ టెస్ట్) 200 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో 3 గంటల పాటు జరుగుతుంది. శారీరక కొలతల పరీక్ష (PMT) ఎత్తు, ఛాతీ (పురుషులకు), బరువు (మహిళలకు) సరిచూస్తారు. శారీరక సామర్థ్య పరీక్ష 1600 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్ పోటీలు ఉంటాయి.
ఫైనల్ రాత పరీక్షలో ఇంగ్లీష్, అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్ అంశాలపై 200 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. ఫైనల్ రాత పరీక్షలో వచ్చిన మార్కుల ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు రుసుము
ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ అభ్యర్థులకు(ఏపీ లోకల్/నాన్-లోకల్) రూ.300, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు(ఏపీ లోకల్స్) రూ. 150గా దరఖాస్తు రుసుము ఉంది. అధికారిక వెబ్‌సైట్ https://slprb.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. మొదటి దశ దరఖాస్తు పూర్తి చేసి ఫీజు చెల్లించాలి. ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు PMT/PETకి హాజరయ్యే ముందు రెండో దశ దరఖాస్తు సమాచారాన్ని, ధృవీకరణ పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


