TGPSC Syllabus Change : టీజీపీఎస్సీ నుంచి అలర్ట్.. పోటీ పరీక్షల సిలబస్ మార్పుపై అప్డేట్!
TGPSC Syllabus Change : ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించి టీజీపీఎస్సీ నుంచి కీలక అప్డేట్ వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షల సిలబస్ మార్పుపై క్లారిటీ ఇచ్చింది.
తెలంగాణలో వివిధ ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల సిలబస్ మార్పులపై వస్తున్న ఊహాగానాలకు, విజ్ఞప్తులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) చెక్ పెట్టింది. పలు ఉద్యోగ నియామకాలకు సంబంధించి సిలబస్ సవరణలపై అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున విన్నపాలు, విచారణలు వస్తుండటంతో స్పష్టతనిస్తూ టీజీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది.

వివిధ ఉద్యోగ పరీక్షల సిలబస్‌ను మార్చేందుకు టీజీపీఎస్సీ ఎలాంటి ప్రత్యేక సిలబస్ కమిటీని ఏర్పాటు చేయలేదని టీజీపీఎస్సీ తేల్చిచెప్పింది. నియామక పరీక్షల సిలబస్‌లో ఏవైనా పెద్ద ఎత్తున మార్పులు చేయాల్సి వస్తే, ఆ వివరాలను కనీసం ఒక సంవత్సరం ముందే అభ్యర్థులకు ముందస్తుగా తెలియజేస్తామని కమిషన్ స్పష్టం చేసింది.
ఒకవేళ సిలబస్‌లో చాలా స్వల్పమైన మార్పులు ఉంటే.. ఆ వివరాలను సంబంధిత ఉద్యోగ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌తో పాటే విడుదల చేస్తామని పేర్కొంది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలోనూ, పలు అభ్యర్థుల వర్గాల్లోనూ టీజీపీఎస్సీ పరీక్షల సిలబస్ మారుతోందనే వార్తలు విస్తృతంగా ప్రచారం అయ్యాయి. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 వంటి కీలకమైన పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులు ఈ ప్రచారంతో కొంత అయోమయానికి గురయ్యారు. కమిషన్ స్పందించి ముందస్తుగా ప్రకటన చేయడంతో పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థులకు పెద్ద ఊరట లభించింది.
సామాజిక మాధ్యమాల్లో వచ్చే అనధికారిక వార్తలను, ఊహాగానాలను నమ్మవద్దని అధికార యంత్రాంగం కోరింది. సిలబస్, నోటిఫికేషన్లు, పరీక్షల తేదీలకు సంబంధించిన అధికారిక సమాచారం కోసం అభ్యర్థులు క్రమం తప్పకుండా టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.in ను మాత్రమే పరిశీలించాలని సూచించారు.
టీజీపీఎస్సీ జాబ్ నోటిఫికేషన్
హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డులో ఖాళీగా ఉన్న 130 మేనేజర్ (ఇంజినీరింగ్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది టీజీపీఎస్సీ. ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం. ఈ పోస్టులకు అర్హత ఉన్న అభ్యర్థులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ https://www.tgpsc.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం సెప్టెంబర్ 23, 2026 నుంచి అక్టోబర్ 17 వరకు ఉంటుంది. 2026 డిసెంబరు నెలలో రాత పరీక్షలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు TGPSC తాత్కాలిక షెడ్యూల్‌లో పేర్కొంది. ఈ పోస్టులన్నీ మల్టీజోన్-2 పరిధిలోకి వస్తాయి. 2026 జూలై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 54,220 నుంచి రూ. 1,33,630 వరకు వేతన స్కేలు లభిస్తుంది. పూర్తి వివరాల కోసం కింది వార్తను చదవండి
టీజీపీఎస్సీ నుంచి శుభవార్త - 130 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ముఖ్య తేదీలివే
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


