హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికకు నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికను ప్రధాన పార్టీలు చాలా సీరయస్‌గా తీసుకున్నాయి. నవంబర్ 11న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ సమయాన్ని ఈసీ గంటసేపు పెంచింది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో 4.01 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 2.08 లక్షలకు పైగా పురుషులు, 1.92 లక్షలకు పైగా మహిళలు. ఈ ఏడాది జూన్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.
ఈ బై పోల్‌లో 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. బీజేపీ నుంచి దీపక్ రెడ్డిని నిలబెట్టగా, మాగంటి గోపీనాథ్ భార్య సునీత బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎఐఎంఐఎం మద్దతు పొందుతున్నారు. హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ప్రకారం.. మొత్తం 407 పోలింగ్ కేంద్రాలలో 226 పోలింగ్ కేంద్రాలు క్లిష్టమైనవిగా గుర్తించారు.
పోలింగ్ కోసం 1,761 మంది పోలీసులతో పాటు, ఎనిమిది కంపెనీల కేంద్ర పారామిలిటరీ దళాలు(CISF) మోహరించారు. హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద తగినంత భద్రత కల్పించే ఏర్పాట్లు చేశారు. అలాగే పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా శాంతిభద్రతలను పర్యవేక్షించడానికి మొబైల్ స్క్వాడ్‌లతో పాటు.. అన్ని పోలింగ్ కేంద్రాలలో పోల్ ప్రత్యక్ష ప్రసారం కోసం వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. డ్రోన్ నిఘా కూడా ఉంటుంది.
407 పోలింగ్ కేంద్రాల్లో 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. డ్రోన్ల ద్వారా పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణ ఉంటుంది. కేంద్ర బలగాలతో భద్రత కట్టుదిట్టం చేశారు. 45 ఫ్లైయింగ్ స్క్వాడ్ టీములను ఏర్పాటు చేశారు. 103 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఇప్పటిదాకా 230 మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేశారు.
{{/usCountry}}407 పోలింగ్ కేంద్రాల్లో 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. డ్రోన్ల ద్వారా పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణ ఉంటుంది. కేంద్ర బలగాలతో భద్రత కట్టుదిట్టం చేశారు. 45 ఫ్లైయింగ్ స్క్వాడ్ టీములను ఏర్పాటు చేశారు. 103 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఇప్పటిదాకా 230 మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేశారు.
{{/usCountry}}నవంబర్ 9న సాయంత్రం 6 గంటల నుండి పోలింగ్ రోజు సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రాంతాలలో మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. వైన్ షాపులు మూసివేశారు. కౌంటింగ్ రోజున కూడా నవంబర్ 14న ఉదయం 6 గంటల నుండి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఈ ఉత్తర్వు అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు.