...
...
Next Story

Amazon Bazaar : అమెజాన్ బజార్ దూకుడు - తెలుగు రాష్ట్రాల్లో 4 రెట్లు పెరిగిన ఆర్డర్లు

Amazon Bazaar Orders in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో అమెజాన్ బజార్‌కు అనూహ్య స్పందన లభిస్తోంది. గతేడాదితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఆర్డర్లు 4 రెట్లు పెరగ్గా…. హైదరాబాద్‌లో కొత్త కస్టమర్ల సంఖ్య భారీగా పెరిగినట్లు సంస్థ వెల్లడించింది.

Published on: May 13, 2026, 07:30:47 IST
Advertisement

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియాకు చెందిన 'అమెజాన్ బజార్' తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. తక్కువ ధరలో నాణ్యమైన ఉత్పత్తులను అందించే ఉద్దేశంతో ప్రారంభమైన ఈ ప్లాట్‌ఫామ్‌కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆదరణ భారీగా పెరిగింది. గతేడాదితో పోలిస్తే ఈ రెండు రాష్ట్రాల్లో ఆర్డర్ల సంఖ్య ఏకంగా 4 రెట్లు పెరిగిందని అమెజాన్ బజార్ ఇండియా హెడ్ సమీర్ లల్వానీ వెల్లడించారు.

పెరిగిన ఆర్డర్లు….

అమెజాన్ బజార్ దూకుడు
అమెజాన్ బజార్ దూకుడు

ముఖ్యంగా భాగ్యనగరం హైదరాబాద్‌లో అమెజాన్ బజార్ తన ప్రభావాన్ని స్పష్టంగా చూపుతోంది. మంగళవారం విలేకరుల సమావేశంలో లల్వానీ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో కొత్తగా సైన్-అప్ అవుతున్న కస్టమర్ల సంఖ్యలో 4 రెట్లు వృద్ధి నమోదైందని తెలిపారు. కేవలం 2026 సంవత్సరం మొదటి నాలుగు నెలల్లోనే హైదరాబాద్ మార్కెట్‌లో ఆరు రెట్లు వృద్ధిని సాధించామని ప్రకటించారు. 2024లో ప్రారంభమైన ఈ విభాగం… అతి తక్కువ కాలంలోనే సామాన్యులకు చేరువకావడం గమనార్హం.

ఏయే విభాగాల్లో వృద్ధి ఎలా ఉందనే అంశాలపై సమీర్ లల్వానీ స్పష్టతనిచ్చారు. మహిళల ఫ్యాషన్ విభాగంలో ఆర్డర్లు 6 రెట్లు పెరిగాయి. హోమ్ అండ్ కిచెన్ ఉత్పత్తులకు అత్యధికంగా 8 రెట్లు డిమాండ్ పెరిగింది. ఎలక్ట్రానిక్ యాక్సెసరీస్ విభాగంలో 4 రెట్ల వృద్ధి నమోదైంది.

కేవలం అమ్మకాలే కాకుండా…. స్థానిక వ్యాపారులకు కూడా అమెజాన్ బజార్ పెద్ద పీట వేస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అమెజాన్ ప్లాట్‌ఫామ్‌పై మొత్తం 75,000 మందికి పైగా విక్రేతలు ఉండగా, అందులో 1,200 మంది ప్రత్యేకంగా అమెజాన్ బజార్‌లో భాగస్వాములుగా ఉన్నారు.

"ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అమెజాన్ బజార్‌కు కీలకమైన వృద్ధి కేంద్రాలు. ఆన్‌లైన్ షాపింగ్ విషయంలో వినియోగదారుల ప్రవర్తనలో నిర్మాణాత్మక మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా టైర్-2, టైర్-3 నగరాల నుంచి వస్తున్న స్పందన ఆశాజనకంగా ఉంది," అని సమీర్ లల్వానీ వివరించారు.

పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా అమెజాన్ తన కార్యకలాపాలను మరింత వేగవంతం చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 8 ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లు, 3 సార్టేషన్ సెంటర్లు, సుమారు 1,500 మంది హబ్ డెలివరీ పార్ట్‌నర్లతో బలమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది. దీనివల్ల మారుమూల పట్టణాలు, గ్రామాలకు కూడా వేగంగా డెలివరీ చేసే సదుపాయం కలుగుతోంది. అమెజాన్ బజార్ 2024లో ప్రారంభించిన సంగతి తెలిసిందే.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks