టాప్ 26లో పది మంది మనోళ్లే.. జేఈఈ మెయిన్ సెషన్ 2 ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా

JEE Main Sessions 2 Results : జేఈఈ మెయిన్ సెషన్ 2 ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. తెలంగాణ నుంచి ఐదుగురు విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు. ఏపీ నుంచి కూడా ఐదుగురు విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు.

Published on: Apr 21, 2026 10:04 AM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జేఈఈ మెయిన్‌-2 ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఈ పరీక్షల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. దేశంలో 26 మంది విద్యార్థులు వంద పర్సంటైల్‌ సాధించగా అందులో ఏకంగా పది మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందినవారే ఉన్నారు.

జేఈఈ మెయిన్ 2026 సెషన్​ 2 ఫలితాలు
జేఈఈ మెయిన్ 2026 సెషన్​ 2 ఫలితాలు

తెలంగాణ నుంచి మంథా శివ కామేష్, దోర్నాల భవితేష్ రెడ్డి, సాయి రిత్విక్ రెడ్డి, వివాన్ శరద్ మహేశ్వరి, రిషి ప్రేమ్‌నాథ్ ఈ ఐదుగురు టాపర్లుగా నిలిచారు.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జొన్నల రోషన్‌ మణిదీ్‌పరెడ్డి, నరేంద్రబాబుగారి మహిత్‌, తుంగా దుర్గా సుప్రభాత్‌, పసల మోహిత్‌, బిజ్జం వెంకట చంద్రశేఖర్‌రెడ్డి 100 పర్సంటైల్ సాధించినవారిలో ఉన్నారు.

గతేడాదితో పోలీస్తే.. ఈసారి తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా ఉన్న NITలు, IIITలు, ఇతర అగ్రశ్రేణి ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి జేఈఈ మెయిన్ ఉపయోగపడుతుంది. రాబోయే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకులు సాధించి, అగ్రశ్రేణి ఐఐటీలలో ప్రవేశం పొందడమే తమ లక్ష్యమని టాపర్లు తెలిపారు.

ఏప్రిల్‌ 2 నుంచి 8 వరకు ఈ పరీక్షలు జరిగాయి. 11.23 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2 ఫలితాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారికంగా ప్రకటించింది. ఫలితాలు, స్కోర్‌కార్డులు, ఆల్ ఇండియా ర్యాంక్ (AIR) జాబితా విడుదల అయ్యాయి.

విద్యార్థులు తమ స్కోర్‌కార్డులను అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2కు సుమారు 11.23 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. పేపర్ 1 (బీఈ/బీటెక్) కోసం దాదాపు 11.06 లక్షల మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, మొత్తం హాజరు దాదాపు 93 శాతంగా ఉంది.

JEE మెయిన్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు మే 17న జరగనున్న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు హాజరయ్యేందుకు అర్హులు. ఈ పరీక్ష ఐఐటీల వంటి ప్రతిష్టాత్మక సంస్థలలో ప్రవేశానికి మార్గంగా పనిచేస్తుంది. జేఈఈ మెయిన్ 2026 ఫైనల్ NTA స్కోర్ కాపీ అభ్యర్థుల రిజిస్టర్డ్ ఇ-మెయిల్ చిరునామాకు కూడా పంపిస్తారు.

ఈ లింక్ క్లిక్ చేసి ఫలితాలు చూడొచ్చు

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More