...
...
Next Story

ఐబొమ్మ రవి కేసులో మరో ట్విస్ట్.. సినిమాలను పైరసీ చేయలేదట!

ఐబొమ్మ రవి కేసులో మరో విషయం వెలుగులోకి వచ్చింది. సినిమాలను అతడు పైరసీ చేయలేదని తెలుస్తోంది. వేరే విధంగా సినిమాలను కొనేవాడని విచారణలో వెల్లడైంది. మరోవైపు నాంపల్లి కోర్టు అతడికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

Published on: Nov 26, 2025, 21:27:18 IST
Advertisement

ఐబొమ్మ రవి కేసులో ట్విస్ట్ నెలొంది. ఇమంది రవి సినిమాలు పైరసీ చేయలేదని, సినిమాలను కొని వాటిని కంటెంట్ మేనెజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా ఐబొమ్మలో అప్‌లోడ్ చేసేవాడని పోలీసులు గుర్తించారు. కొన్ని రోజులుగా ఐబొమ్మ రవిని విచారించిన పోలీసులు కీలక విషయాలను తెలుసుకున్నారు. అయితే ఐబొమ్మ రవి సినిమాలను నేరుగా పైరసీ చేయలేదని, టెలిగ్రామ్, మూవీరూల్జ్, తమిళ్ ఎంవీ వంటి పైరసీ సైట్ల నుంచి వాటిని కొనుగోలు చేసే వాడని తెలిసింది.

ఐబొమ్మ రవి
ఐబొమ్మ రవి

సినిమా క్లారిటీ సరిగా లేకపోతే.. దానికి హెచ్‌డీ‌గా మార్చుకునేందుకు కొన్ని టూల్స్ ఉపయోగించేవాడు. తర్వాత ఐబొమ్మ, బప్పం సైట్లలో అప్‌లోడ్ చేసేవాడు. ఇందుకుగానూ సినిమా కొన్నందుకు క్రిప్టో కరెన్సీ రూపంలో డబ్బులు చెల్లించేవాడు. ఈ సైట్ల ద్వారా లక్షల మంది డేటాను తన వద్ద స్టోర్ చేసుకున్నాడు రవి. బెట్టింగ్, గేమింగ్ యాప్స్ ప్రమోట్ చేసి కొట్లు సంపాదించాడు.

ఐబొమ్మ ద్వారా కోట్లు సంపాదించిన రవి ఎక్కువగా విదేశాలకు తిరుగుతూ ఖర్చుచేశాడు. అతడి ఖాతాలో ఉన్న మూడు కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు. అంతేకాదు హైదరాబాద్‌లో ఓ ప్లాట్, వైజాగ్‌లోని ఆస్తులు సీజ్ అయ్యాయి. హైదరాబాద్‌కు వచ్చిన రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే చాలాసేపు అతడి డోర్ తీయకుండా ప్లాట్‌లోనే ఉన్నాడు. ఆ సమయంలో కీలక డేటా నాశనం చేసి ఉంటాడనే అనుమానాలు ఉన్నాయి.

మరోవైపు ఇంకో కేసులో నాంపల్లి కోర్టు అతనికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. మరో 3 కేసులలో సైబర్ క్రైమ్ పోలీసులు అతనిపై పిటి వారెంట్ జారీ చేశారు. మెుత్తం ఇమంది రవి మీద ఐదు కేసులు ఉన్నాయి. కోర్టు అనుమతి తర్వాత పోలీసులు అతన్ని ఆ కేసుల్లో అరెస్టు చేస్తారు. పోలీసుల కస్టడీ అభ్యర్థనను కోర్టు విచారించింది. మూడు రోజులపాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks