బీడీఎల్ హైదరాబాద్‌లో 80 ఉద్యోగ ఖాళీలు - నోటిఫికేషన్ వివరాలివే

భారత్ డైనమిక్స్ లిమిటెడ్ హైదరాబాద్‌ (బీడీఎల్) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజ్‌మెంట్ ట్రెయినీ ఖాళీలను భర్తీ చేయనున్నారు. డిసెంబర్‌ 3వ తేదీ నుంచి డిసెంబర్ 29 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు.

Published on: Nov 28, 2025 2:40 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత్ డైనమిక్స్ లిమిటెడ్ హైదరాబాద్‌ నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజ్‌మెంట్ ట్రెయినీ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 80 ఖాళీలున్నాయని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

బీడీఎల్ హైదరాబాద్‌లో 80 ఉద్యోగ ఖాళీలు
బీడీఎల్ హైదరాబాద్‌లో 80 ఉద్యోగ ఖాళీలు

ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ డిసెంబర్ 3 నుంచి ప్రారంభమవుతుంది. డిసెంబర్ 29 వరకు అప్లయ్ చేసుకోవచ్చు. మొత్తం 9 విభాగాల్లో 80 ఖాళీలుండగా… రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది జాబితాను ప్రకటిస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ. నెలకు రూ.40,000 - రూ.1,40,000 జీతం చెల్లిస్తారు.

బీడీఎల్ నోటిఫికేషన్ - ముఖ్యమైన వివరాలు:

  • ఉద్యోగ ప్రకటన -భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్), హైదరాబాద్
  • ఉద్యోగ ఖాళీలు -మేనేజ్‌మెంట్ ట్రెయినీ
  • మొత్తం ఖాళీలు - 80
  • విభాగాలు - ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్‌ సైన్స్‌, మెటలర్జీ, కెమికల్, సివిల్, ఫైనాన్స్‌, HumanResources
  • అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 55 నుంచి 60 శాతం మార్కులతో డిగ్రీ ఉండాలి. పూర్తి వివరాలను https://bdl-india.in/recruitments వెబ్ సైట్ లో చూడొచ్చు.
  • దరఖాస్తు విధానం - ఆన్ లైన్
  • దరఖాస్తులు ప్రారంభం - 3 డిసెంబర్ 2025
  • దరఖాస్తులకు తుది గడువు - 29 డిసెంబర్ 2025
  • నెల జీతం - రూ. 40,000 - రూ. 1,40,000
  • రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
  • కంప్యూటర్ బేస్డ్ పరీక్ష 2 గంటలు ఉంటుంది. ఇందులో నుంచి 85 శాతం వెయిటేజీ ఇస్తారు. మిగతా 15 శాతం ఇంటర్వ్యూకు కేటాయిస్తారు.
  • పరీక్షా కేంద్రాలు - హైదరాబాద్, విజయవాడతో పాటు అహ్మాదాబాద్, గాంధీనగర్, బెంగళూర్, భోపాల్, భువనేశ్వర్, చెన్నై, ఢిల్లీ, కోల్ కత్తా, లక్నో, ముంబై, త్రివేండ్రం
  • అధికారిక వెబ్ సైట్ - https://bdl-india.in/recruitments
News/Telangana/బీడీఎల్ హైదరాబాద్‌లో 80 ఉద్యోగ ఖాళీలు - నోటిఫికేషన్ వివరాలివే
News/Telangana/బీడీఎల్ హైదరాబాద్‌లో 80 ఉద్యోగ ఖాళీలు - నోటిఫికేషన్ వివరాలివే