తాండూరు సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఖాళీలు.. ఇంటర్వ్యూ మాత్రమే!
ప్రభుత్వ రంగ సంస్థ అయిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)లో ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన ఖాళీలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
భారత ప్రభుత్వం పరిధిలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఖాళీలకు నోటిఫికేషన్ వెలువడింది. వికారాబాద్ జిల్లా తాండూర్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఫిక్స్‌డ్ టర్మ్ కాల కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది స్థానాలకు రిటైర్డ్ అర్హత కలిగిన, అనుభవజ్ఞులైన నిపుణులను నియమించాలని సీసీఐ అనుకుంటోంది.

తాండూర్ సిమెంట్ ఫ్యాక్టరీ కోసం సీసీఐ ఈ స్థానాలను వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా నియమించాలని కోరుకుంటోంది. ఇందులో రెండు పోస్టులు ఉన్నాయి. ఒకటి సూపర్ వైజర్, మరొకటి షిఫ్ట్ ఆపరేషన్ పోస్టు. పోస్టుల ఆధారంగా అర్హత ఉండాలి. 05.12.2025న అంటే శుక్రవారం ఉదయం 10.00 గంటలకు తెలంగాణ, తాండూర్ మండలం, వికారాబాద్ జిల్లా, కరన్‌కోటే గ్రామంలోని సీసీఐ లిమిటెడ్, తాండూర్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఇంటర్వ్యూ ఉంటుంది.
సూపర్ వైజర్ పోస్టుకు బి.ఎస్సీ (కెమిస్ట్రీ)/ కెమికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేసి ఉండాలి. సిమెంట్ తయారీ/ఏదైనా భారీ పరిశ్రమలో కనీసం 20 సంవత్సరాల అనుభవం, Pyro/ KILN/ సిమెంట్ మిల్లులో కార్యాచరణ పరిజ్ఞానం ఉండాలి.
షిఫ్ట్ ఆపరేషన్ పోస్టుకు ఐటీఐ/డిప్లొమా/B.Tech - ఇన్స్ట్రుమెంట్ ఇంజనీరింగ్. ఇన్స్ట్రుమెంట్ విభాగంలో సిమెంట్ తయారీ పరిశ్రమలో కనీసం 02 సంవత్సరాల అనుభవం ఉండాలి. సూపర్ వైజర్‌కు 62 ఏళ్లు, షిఫ్ట్ ఆపరేషన్‌కు 55 ఏళ్లు మించకూడదు.
ఫిక్స్‌డ్ టర్మ ప్రాతిపదికన ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. అయితే పనితీరు, కార్పొరేషన్ అవసరాల ఆధారంగా పొడిగింపులో మార్పులు ఉంటాయి. జీతం అనుభవంపై ఆధారపడి ఉంటుంది. సూపర్ వైజర్‌కు నెలకు రూ. 40 వేల నుంచి 50 వేల వరకు ఉంటుంది. షిఫ్ట్ ఆపరేషన్‌కు రూ.25000 నుంచి రూ.30000 వరకు ఇస్తారు.
ఆసక్తిగల అభ్యర్థులు 05.12.2025న, అంటే శుక్రవారం ఉదయం 10.00 గంటలకు, తాండూర్ మండలం, కరన్‌కోటే గ్రామంలోని సీసీఐ లిమిటెడ్, తాండూర్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఇంటర్వ్యూ హాజరుకావాలి. అయితే రిజిస్ట్రేషన్ కోసం రిపోర్ట్ చేయాలి. ఇటీవల పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్, విద్యా అర్హతలు, అనుభవం, పుట్టిన తేదీ, కాపీలతో పాటు దరఖాస్తు ఫారమ్ పూర్తి చేసి సమర్పించాలి. అర్హతలు, వయస్సు మొదలైన వాటికి మద్దతు ఇచ్చే అన్ని పత్రాలను వాక్-ఇన్ ఇంటర్వ్యూ సమయంలో ధృవీకరణ కోసం సమర్పించాలి.
ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి jp.pal@cciltd.in / hh.lenkaccitdo@gmail.com మెయిల్ చేయవచ్చు. లేదంటే 8712620403 కాల్ చేసి మాట్లాడవచ్చు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


