హైదరాబాద్‌లో డైట్ కాలేజీ ఫ్యాకల్టీ పోస్టులు.. అప్లికేషన్ చివరి ఛాన్స్!
హైదరాబాద్ నేరెడ్‌మెట్‌లోని జిల్లా విద్యా శిక్షణ సంస్థ(DIET) వివిధ సబ్జెక్టులలోని అధ్యాపక ఖాళీలను భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానించింది. జులై 14తో గడువు ముగుస్తోంది.
హైదరాబాద్ జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఒక ముఖ్యమైన అలర్ట్. నేరెడ్‌మెట్‌లోని జిల్లా విద్యా, శిక్షణ సంస్థ(DIET)లో ఖాళీగా ఉన్న వివిధ సబ్జెక్టుల ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి జులై 14, 2026 చివరి తేదీగా అధికారులు ప్రకటించారు.

ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు, ఎంపిక ప్రక్రియ సమాచారం చూడండి. ఈ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి హైదరాబాద్ జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం పనిచేస్తున్న ఇన్-సర్వీస్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు అర్హులు. ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న స్కూల్ అసిస్టెంట్లు కూడా చేసుకోవచ్చు.
'హైదరాబాద్ జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న అర్హులైన గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.' అని ఒక పత్రికా ప్రకటన తెలిపింది.
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను మొత్తం 100 మార్కులకు గానూ రెండు దశల్లో నిర్వహిస్తారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)80 మార్కులకు ఉంటుంది. ఇంటర్వ్యూ, డెమోకు 20 మార్కులు కేటాయించారు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జులై 14, 2026గా ఉంది. వెంటనే అప్లై చేసుకోవాలి. నియామక పరీక్షల జులై 25 నుండి జూలై 31, 2026 వరకు ఉంటుంది.
అర్హత, ఆసక్తి ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది. అధికారిక వెబ్‌సైట్ లింక్ tgscertrecruitment.tgonline.in ఓపెన్ చేసి అప్లై చేసుకోవాలి.
ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు, సిలబస్, పరీక్షా విధానం కోసం పైన పేర్కొన్న అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. గడువు ముగిసేలోపు అర్హులైన ఉపాధ్యాయులు ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


