తెలంగాణ దేవాదాయ శాఖలో ఉద్యోగాల భర్తీ అంటూ ఇటీవల ప్రచారం జరిగింది. చాలా మంది అభ్యర్థులు ఈ పోస్టుల నోటిఫికేషన్ కోసం ఎదురుచూశారు. ఈ 190 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల ఖాళీలు ఉన్నాయని ఆన్‌లైన్‌లో ప్రచారంలో ఉన్న నకిలీ నియామక ప్రకటన పట్ల రాష్ట్ర దేవాదాయ శాఖ హెచ్చరించింది.

దేవాదాయ శాఖ అటువంటి నియామక ప్రకటనను ఏదీ విడుదల చేయలేదని అధికారులు స్పష్టం చేశారు. ఉద్యోగార్థులు ఆ తప్పుడు ప్రకటనను నమ్మవద్దని, దానికి స్పందించవద్దని సూచించారు. అన్ని నియామక ప్రకటనలు కేవలం అధికారిక ప్రభుత్వ, శాఖాపరమైన వెబ్‌సైట్‌ల ద్వారా మాత్రమే ఉంటాయి. ఈ నకిలీ ప్రకటనను సృష్టించి, వ్యాప్తి చేస్తున్న వ్యక్తులపై సైబర్ క్రైమ్ పోలీసుల ద్వారా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు దేవాదాయ శాఖ పేర్కొంది.
ఏమని ఫేక్ న్యూస్ వైరల్ అయింది?
రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలు, దేవాదాయ శాఖ పరిధిలోని కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలపడంతో అధికారులు నోటిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేశారని న్యూస్ వైరల్ అయింది.
మొత్తం 190 ఖాళీల భర్తీ కోసం ఈ ప్రక్రియ జరుగుతోంది. ఇందులో ప్రధానంగా కింది పోస్టులు ఉన్నాయి: ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు గ్రేడ్-I, గ్రేడ్-II, గ్రేడ్-III కేటగిరీల్లో ఆలయాల నిర్వహణను చూసేందుకు ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారని ప్రచారం చేశారు. జూనియర్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ కమిషనర్లకు సంబంధించిన పోస్టులు ఇందులో ఉన్నాయని చెప్పారు.
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఖచ్చితంగా హిందూ మతానికి చెందిన వారై ఉండాలి. కనీస వయస్సు 18 సంవత్సరాలు కాగా, గరిష్ట వయస్సు 44 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వయోసడలింపు ఉంటుందని వార్తను వైరల్ చేశారు.
{{/usCountry}}గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఖచ్చితంగా హిందూ మతానికి చెందిన వారై ఉండాలి. కనీస వయస్సు 18 సంవత్సరాలు కాగా, గరిష్ట వయస్సు 44 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వయోసడలింపు ఉంటుందని వార్తను వైరల్ చేశారు.
{{/usCountry}}అంతేకాదు.. రాత పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో పేపర్-1 (జనరల్ స్టడీస్), పేపర్-2 (హిందూ ఫిలాసఫీ, టెంపుల్ సిస్టమ్ - కేవలం EO పోస్టులకు) పరీక్షలు నిర్వహిస్తారు. రాత పరీక్షలో సాధించిన మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దీనికి ఇంటర్వ్యూలు ఉండవని తప్పుడు వార్తను ప్రచారం చేశారు. దీనిపై తాజాగా స్పందించిన దేవాదాయ శాఖ ఎలాంటి పోస్టుల భర్తీ చేయడం లేదని క్లారిటీ ఇచ్చింది.