Telangana Govt : దేవాదాయ శాఖలో కొత్తగా 190 ఈవో పోస్టులు - సర్కార్ గ్రీన్ సిగ్నల్
TG Govt Endowments Dept Vacancies : రాష్ట్రంలోని దేవాలయాల నిర్వహణను మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేవాదాయ శాఖలో వివిధ కేటగిరీలకు చెందిన 190 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (EO) పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Telangana Temple Executive Officers : రాష్ట్రంలోని దేవాలయాల పరిపాలన, పారదర్శకతను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం భారీ స్థాయిలో పోస్టులను మంజూరు చేసింది. దేవాదాయశాఖ పరిధిలోకి వచ్చే వివిధ గ్రేడ్ల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఏప్రిల్ 30న ఉత్తర్వులు జారీ చేసింది.

పోస్టుల వివరాలు :
ప్రభుత్వం మంజూరు చేసిన మొత్తం 190 పోస్టులను మూడు కేటగిరీలుగా విభజించారు.
- ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-I : 41 పోస్టులు
- ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-II : 62 పోస్టులు
- ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-III : 87 పోస్టులు
రాష్ట్రంలోని 7 జోన్ల వారీగా పోస్టుల కేటాయింపును పరిశీలిస్తే…. అత్యధిక దేవాలయాలు, భక్తుల రద్దీ ఉన్న ప్రాంతాలకు ప్రభుత్వం పెద్దపీట వేసింది.
- చార్మినార్ జోన్ (జోన్-6): హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలతో కూడిన ఈ జోన్‌కు అత్యధికంగా 67 పోస్టులు లభించాయి. ఇందులో 10 గ్రేడ్-1, 27 గ్రేడ్-2 మరియు 30 గ్రేడ్-3 పోస్టులు ఉన్నాయి.
- యాదాద్రి-భువనగిరి జోన్ (జోన్-5): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి ఉన్న ఈ జోన్‌కు 48 పోస్టులు దక్కాయి. ఇక్కడ గ్రేడ్-3 పోస్టులు అత్యధికంగా 27 ఉండటం గమనార్హం.
- జోగులాంబ జోన్ (జోన్-7): గద్వాల, నాగర్‌కర్నూల్ వంటి ప్రాంతాలు ఉన్న ఈ జోన్‌కు 28 పోస్టులు కేటాయించారు.
- భద్రాద్రి-కొత్తగూడెం జోన్ (జోన్-4): దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి జోన్‌కు 20 పోస్టులు మంజూరు చేశారు. ఇక్కడ 9 గ్రేడ్-1 పోస్టులు ఉన్నాయి.
- బాసర జోన్ (జోన్-2): నిర్మల్, నిజామాబాద్ జిల్లాల పరిధిలోని ఈ జోన్‌కు 14 పోస్టులు కేటాయించారు.
- రాజన్న జోన్ (జోన్-3): ఈ జోన్‌కు 7 పోస్టులు దక్కాయి.
- కాళేశ్వరం జోన్ (జోన్-1): ఈ జోన్‌కు అత్యల్పంగా 6 పోస్టులు కేటాయించారు.
రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా భక్తుల రద్దీ పెరగడం, ఆలయాల ఆదాయం వృద్ధి చెందడంతో పరిపాలనలో సవాళ్లు ఎదురవుతున్నాయి. అనేక దేవాలయాల్లో ఇన్-ఛార్జ్ అధికారులతోనే పనులు నడుస్తుండటంతో భక్తుల సౌకర్యాల పర్యవేక్షణ కుంటుపడుతోంది. ఈ నేపథ్యంలో ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం…. కొత్తగా 190 పోస్టులను మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ పోస్టుల భర్తీ ద్వారా ప్రధాన దేవాలయాల్లో పూర్తిస్థాయి అధికారులు అందుబాటులో ఉంటారు. తద్వారా ఆలయ భూముల పరిరక్షణ, ఆదాయ వ్యయాల ఆడిటింగ్, పండుగల నిర్వహణ, భక్తులకు అందే సేవల్లో నాణ్యత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ లేదా నియామక ప్రక్రియపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

