అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద రోడ్డు ప్రమాదం - ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, 15 మందికి గాయాలు

రంగారెడ్డి జిల్లా బాటాసింగారం వద్ద ఆగి ఉన్న లారీని టీజీఆర్‌టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. బాధితులను వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Published on: Oct 19, 2026, 09:56:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

రంగారెడ్డి జిల్లా పరిధిలో ఇవాళ ఉదయం తీవ్ర రహదారి ప్రమాదం చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాటాసింగారం గ్రామం సమీపంలో ఆగి ఉన్న లారీ(ట్రక్కు)ని తెలంగాణ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న దాదాపు 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు.

టీజీఆర్‌టీసీ బస్సును ఢీకొట్టిన ట్రక్
టీజీఆర్‌టీసీ బస్సును ఢీకొట్టిన ట్రక్

హైదరాబాద్ వైపునకు వస్తుండగా….

పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం.. సదరు ఆర్టీసీ బస్సు ఖమ్మం జిల్లా నుంచి హైదరాబాద్ వైపు వస్తుంది. బాటాసింగారం సమీపానికి చేరుకోగానే ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 15 మంది ప్రయాణికులను స్థానికులు, ఆర్టీసీ సిబ్బంది సహాయంతో తక్షణమే వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

సమాచారం అందుకున్న వెంటనే అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత కోసం పోలీసులు విచారణ జరుపుతున్నారు. రోడ్డుపై వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా దెబ్బతిన్న వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More