...
...
Next Story

ATC Utnoor Placements : గిరిజన గ్రామాల నుంచి గ్లోబల్ కంపెనీల వరకు..! ఉట్నూర్ 'ఏటీసీ' విజయగాథ

తెలంగాణ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ATC) అద్భుతాలు సృష్టిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏటీసీ కేంద్రంలో శిక్షణ పొందిన 99 మంది గ్రామీణ, గిరిజన యువతీ యువకులు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు దక్కించుకున్నారు.

Published on: Jun 28, 2026 07:54 AM IST
Advertisement

రాష్ట్ర యువతను గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీలు) అప్పుడే అద్భుత ఫలితాలను ఇస్తున్నాయి. క్షేత్రస్థాయిలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నాయి. నైపుణ్యాలే రేపటి భవిష్యత్తుకు బలమైన పునాది అనే దృఢ సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలు….. పల్లెల్లోని ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలోని వెనుకబడిన, గిరిజన ప్రాంతమైన ఉట్నూర్ ప్రభుత్వ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ సాధించిన ఘన విజయం ఇప్పుడు యావత్ రాష్ట్రానికే ఒక దిక్సూచిగా, ఆదర్శంగా నిలిచింది.

ఎంఎన్సీలలో ఉద్యోగాలు

ఉట్నూర్ ఏటీసీ విజయగాథ - ఎంఎన్సీలలో ఉద్యోగాలు
ఉట్నూర్ ఏటీసీ విజయగాథ - ఎంఎన్సీలలో ఉద్యోగాలు

గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు చెందిన నిరుపేద యువతకు సైతం ప్రపంచ స్థాయి సాంకేతిక నైపుణ్యాలను ఉచితంగా అందించి, వారిని గ్లోబల్ కార్పొరేట్ కంపెనీలకు సిద్ధం చేయాలన్న ప్రభుత్వ సంకల్పం ఉట్నూర్ వేదికగా నిజమైంది. ఈ కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థుల్లో ఏకంగా 99 మంది గ్రామీణ బిడ్డలు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీల్లో (MNCs) భారీ ప్యాకేజీలతో ఉద్యోగాలు సాధించడం విశేషం.

తెలంగాణలో స్కిల్ డెవలప్‌మెంట్ (నైపుణ్యాభివృద్ధి) కార్యక్రమాలు సరైన దిశలో, పక్కా ప్రణాళికతో సాగుతున్నాయనడానికి ఉట్నూర్ ఫలితాలే ప్రత్యక్ష నిదర్శనం. పరిమిత వనరులు, సరైన సదుపాయాలు లేని పల్లెల్లో పుట్టి పెరిగిన విద్యార్థులు.. నేడు అంతర్జాతీయ దిగ్గజ సంస్థల ఆఫర్ లెటర్లు అందుకోవడం వెనుక ప్రజా ప్రభుత్వం అందించిన అత్యాధునిక శిక్షణ, పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా డిజైన్ చేసిన ప్రత్యేక కోర్సులు, పరిశ్రమ నిపుణుల మార్గదర్శకత్వం ఎంతగానో దోహదపడ్డాయి.

పక్కా గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతమైన ఉట్నూర్ ఏటీసీలో శిక్షణ పొందిన విద్యార్థుల ప్రతిభను చూసి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మల్టీ నేషనల్ కంపెనీలు క్యూ కట్టాయి. నేరుగా క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించి మరీ అభ్యర్థులను ఎంపిక చేసుకున్నాయి. అంతర్జాతీయ సంస్థ ‘ష్నైడర్ ఎలక్ట్రిక్’ ఏకంగా 47 మందిని ఎంపిక చేసుకోగా, దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం ‘టాటా మోటార్స్ - పుణె’ (Tata Motors) 36 మంది యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించింది.

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఐటీఐ, పాత కోర్సులకు భిన్నంగా, నేటి గ్లోబల్ పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా ఏటీసీలలో సిలబస్‌ను ప్రభుత్వం ప్రక్షాళన చేసింది. ఉట్నూర్ కేంద్రంలో విద్యార్థులకు నిపుణుల ద్వారా ఈ కింది అత్యాధునిక సాంకేతికతలపై శిక్షణ ఇస్తున్నారు,

  • ఇండస్ట్రీ 4.0 (Industry 4.0), రోబోటిక్స్ (Robotics)
  • సీఎన్‌సీ మెషినింగ్
  • డిజిటల్ మాన్యుఫ్యాక్చరింగ్
  • ఎలక్ట్రిక్ వెహికల్స్ టెక్నాలజీ
  • అడ్వాన్స్‌డ్ సిమ్యులేషన్ టెక్నాలజీ

త్వరలోనే ఈ జిల్లాల్లో….

ఈ ఏటీసీల నెట్‌వర్క్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది యువతకు ఉపాధి కల్పించేలా కార్యాచరణ వేగవంతం చేశారు. కేవలం డిగ్రీలు, సర్టిఫికెట్లు ఉంటే సరిపోదని, చదువుకు సాంకేతిక నైపుణ్యం తోడైతే అంతర్జాతీయ ఉద్యోగాలు సాధించడం నల్లేరుపై నడకేనని ప్రభుత్వం నిరూపించింది. ఈ విజయవంతమైన మోడల్‌ను స్ఫూర్తిగా తీసుకుని…. త్వరలోనే వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో కూడా ఇదే తరహా భారీ ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం దశలవారీగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ మెగా ఉద్యోగ మేళాలు నిర్వహించనున్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe