Hyderabad : చాదర్‌ఘాట్‌లో భారీ అగ్నిప్రమాదం - ఏడు దుకాణాలు దగ్ధం..!

Hyderabad Fire Accident: హైదరాబాద్ చాదర్‌ఘాట్ పరిధిలోని మూసీ నది వెనుక భాగంలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడు కార్ల రిపేర్, డెకరేషన్ షాపులు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. ప్రాణనష్టం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Published on: Jul 10, 2026, 21:24:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్ నగరంలోని చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూసీ నది వెనుక భాగంలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కనీసం ఏడు దుకాణాలు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సకాలంలో స్పందించి దాదాపు గంటపాటు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ప్రమాదం వల్ల భారీగా ఆస్తి నష్టం సంభవించినప్పటికీ, ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

హైదరాబాద్ చాదర్‌ఘాట్‌లో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్ చాదర్‌ఘాట్‌లో భారీ అగ్నిప్రమాదం

ఘటనకు సంబంధించిన వివరాలను సౌత్ జోన్ డీసీపీ ఖారే కిరణ్ వెల్లడించారు. "చాదర్‌ఘాట్ పరిధిలోని మూసీ నది వెనుక వైపు అగ్నిప్రమాదం జరిగినట్లు సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో మాకు సమాచారం అందింది. వెంటనే స్పందించిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే పనులను ప్రారంభించారు.

ఏడు దుకాణాలు దగ్ధం…

ప్రాథమిక సమాచారం ప్రకారం సుమారు ఏడు దుకాణాలు మంటల్లో కాలిపోయాయి. వీటిలో కార్ల మరమ్మతు దుకాణాలు (కార్ రిపేర్ షాప్స్), ఫంక్షన్ హాళ్లకు ఉపయోగించే డెకరేషన్ సామాగ్రి విక్రయించే షాపులు ఉన్నాయి. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు" అని డీసీపీ వివరించారు.

ఈ సందర్భంగా ప్రజలకు డీసీపీ ఖారే కిరణ్ కీలక విజ్ఞప్తి చేశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై లోతైన దర్యాప్తు జరుపుతామని…. ఎవరూ కూడా సోషల్ మీడియాలో గానీ, బయట గానీ ఎలాంటి తప్పుడు వార్తలను, వదంతులను వ్యాప్తి చేయవద్దని కోరారు. హైదరాబాద్ నగరంలో ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More