Aadhaar Biometric Update : ఫ్రీగా పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్‌కు మిగిలి ఉంది మరికొన్ని రోజులే

Aadhaar Biometric Update : పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ కోసం మరికొన్ని రోజులే టైమ్ మిగిలి ఉంది. ప్రస్తుతం అర్హులైన పిల్లలకు ఈ ప్రక్రియ ఉచితంగా లభిస్తున్నందున తల్లిదండ్రులు ఈ అప్‌డేట్ వెంటనే చేయాలని అధికారులు చెబుతున్నారు.

Published on: Aug 23, 2026, 17:15:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పిల్లల ఆధార్ వివరాలు కచ్చితంగా ఉండేలా చూసేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కీలక ప్రకటన చేసింది. 5 నుంచి 17 ఏళ్ల లోపు పిల్లలకు అవసరమైన బయోమెట్రిక్ అప్‌డేట్‌ సెప్టెంబర్ 30 వరకు ఉచితంగా అందించనుంది ప్రభుత్వం. గడువు సమీపిస్తున్నందున తల్లిదండ్రులు, సంరక్షకులు వీలైనంత త్వరగా సమీపంలోని ఆధార్ కేంద్రాలకు వెళ్లి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్‌
పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్‌

పిల్లల వయస్సు పెరిగే కొద్దీ వారి చేతి వేలిముద్రలు, కంటిపాప (ఐరిస్)లో మార్పులు వస్తాయి. మొదటిసారి ఆధార్ నమోదు చేసే సమయంలో ఐదేళ్లలోపు పిల్లలకు కేవలం డెమోగ్రాఫిక్ వివరాలు (పేరు, చిరునామా, పుట్టిన తేదీ), ఫోటో మాత్రమే తీసుకుంటారు.

ఐదేళ్లు నిండిన వెంటనే పిల్లల మొదటి బయోమెట్రిక్ వివరాలను (వేలిముద్రలు, ఐరిస్, కొత్త ఫోటో) ఆధార్‌లో నమోదు చేయడం తప్పనిసరి. పిల్లలు టీనేజ్‌లోకి వచ్చి 15 ఏళ్లు నిండిన తర్వాత మరోసారి బయోమెట్రిక్ వివరాలను ఆధార్ డేటాబేస్‌లో అప్‌డేట్ చేయాలి.

పిల్లల 7 నుంచి 15 సంవత్సరాల వయస్సు మధ్య ఉండే బయోమెట్రిక్ అప్‌డేట్‌లకు ఫీజు మినహాయింపును ఒక సంవత్సరం పాటు యూఐడీఏఐ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఉచిత సేవ ప్రస్తుతం వచ్చే సెప్టెంబర్ 30తో ముగియనుంది. పిల్లల ఆధార్ వివరాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉండటం వల్ల అనేక రకాల సేవలు ఎలాంటి ఆటంకం లేకుండా లభిస్తాయి.

స్కూల్స్‌లో అడ్మిషన్ల సమయంలో గుర్తింపు నిరూపణకు ఆధార్ అప్‌డేట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. వివిధ రకాల పోటీ పరీక్షలు, ప్రభుత్వ, ప్రైవేట్ స్కాలర్‌షిప్‌లకు అప్లై చేసే సమయంలో బయోమెట్రిక్ అథెంటికేషన్ వేగవంతమవుతుంది.

విద్యార్థులకు అందే ప్రభుత్వ సబ్సిడీలు, పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందడానికి ఇది సహాయపడుతుంది. గడువు ముగిసిన తర్వాత ఈ బయోమెట్రిక్ అప్‌డేట్ చేయడానికి నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా, తమ పిల్లలను దగ్గరలోని ఆధార్ సేవా కేంద్రానికి తీసుకెళ్లి ఈ ఉచిత అవకాశాన్ని వినియోగించుకోవాలని యూఐడీఏఐ సూచించింది.

భారతదేశంలో నివసించే ప్రతి పౌరుడికి 12 అంకెల ఆధార్ సంఖ్య అత్యంత కీలకమైన గుర్తింపు కార్డుగా మారింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో అన్ని రకాల పౌర సేవల లబ్ధి పొందడానికి ఆధార్ రికార్డులు సరైన వివరాలతో ఉండటం అవసరం.

చిన్న పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ ఉచితంగా చేయడానికి ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కు వెళ్లాలి.అక్కడ వెళ్లిన తర్వాత వేలిముద్రలు, ఐరిష్ స్కాన్, ఫోటోగ్రాఫ్ క్యాప్చర్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆధార్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా ఈ వివరాలను అప్‌డేట్ చేయాలి.

అప్డేట్ చేసిన తర్వాత యూఆర్ఎన్ నెంబర్ పొందవచ్చు. దీనితో అప్డేట్‌ రిక్వెస్ట్ ట్రాక్ చేయవచ్చు. UIDAI అధికారిక వెబ్‌సైట్ ద్వారా యూఆర్ఎన్ నెంబర్ సాయంతో అప్‌డేట్ వివరాలను తెలుసుకోవచ్చు.

ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ( UIDAI ) దేశవ్యాప్త డ్రైవ్‌లో భాగంగా పాఠశాల విద్యార్థులకు 2 కోట్లకు పైగా తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్‌లను పూర్తి చేసింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More