Hyderabad : మాదాపూర్ లో కారు ఢీకొని యువతి దుర్మరణం - జనసేన ఎంపీ కుమారుడిపై కేసు నమోదు

Hyderabad road accident Case : మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద వేగంగా వచ్చిన ఆస్టన్ మార్టిన్ కార్ ఢీకొని 26 ఏళ్ల సేల్స్‌ వుమన్ భారతి ముఖి మృతి చెందారు. కేసు నమోదు చేసిన పోలీసులు…. జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజూష్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Published on: Aug 21, 2026, 09:18:55 IST
ANI | By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Hyderabad road accident Case : మాదాపూర్ ఇనార్బిట్ మాల్ ఎదుట ఆగస్టు 16న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అతివేగంగా వచ్చిన ఆస్టన్ మార్టిన్ కారు ఢీకొట్టడంతో 26 ఏళ్ల సేల్స్‌వుమన్ దారుణంగా బలైంది. స్థానికంగా తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు చేపట్టిన దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

కారు ఢీకొని యువతి దుర్మరణం
కారు ఢీకొని యువతి దుర్మరణం

అసలేం జరిగిందంటే..?

మృతురాలు భారతి ముఖి ఇనార్బిట్ మాల్‌లోని ఒక దుకాణంలో సేల్స్‌వుమన్‌గా పనిచేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో భారతి తన సహోద్యోగితో కలిసి భోజనం తెచ్చుకోవడానికి ఐటీసీ కోహినూర్ వైపు వెళ్లారు. భోజనం తీసుకుని తిరిగి వస్తూ, మాల్ ముందు భాగంలో రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అతివేగంతో, తీవ్ర నిర్లక్ష్యంతో దూసుకొచ్చిన ఒక లగ్జరీ కారు భారతిని బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఆమె తలకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు, సహోద్యోగులు ఆమెను జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునే సరికి ఆమె మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారని మాదాపూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కేవీ సుబ్బారావు వెల్లడించారు.

బాధితుల ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 106(1) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా ప్రమాదానికి కారణమైన కారును జనసేన పార్టీ రాజ్యసభ ఎంపీ, ప్రముఖ వ్యాపారవేత్త లింగమనేని రమేష్ కుమారుడు లింగమనేని సంజూష్ (21) నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వ్యాపారవేత్త అయిన సంజూష్ మాదాపూర్‌లోనే నివాసముంటున్నారు. ఘటన జరిగిన రోజే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ప్రమాద సమయంలో నిందితుడు మద్యం లేదా మత్తు పదార్థాలు ఏమైనా తీసుకున్నాడా అని తెలుసుకునేందుకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్ పరీక్షలు నిర్వహించారు. అతని రక్త నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL)కి పంపించారు. ప్రమాదానికి కారణమైన ఆస్టన్ మార్టిన్ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోందని, పోస్ట్‌మార్టం నివేదిక రావాల్సి ఉందని ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More