హైదరాబాద్‌లో దారుణం - కేవలం రూ.10 చిల్లర కోసం ఆటో డ్రైవర్‌ను కొట్టి చంపేశారు!

హైదరాబాద్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టేపల్లిలో రూ.10 చిల్లర విషయంలో తలెత్తిన వివాదం ఓ ఆటో డ్రైవర్ ప్రాణాలను తీసింది. భార్యాపిల్లల ముందే ఆటో డ్రైవర్‌ను రౌడీషీటర్లు కొట్టి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Published on: Sep 21, 2026, 09:18:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్ నగరంలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కేవలం పది రూపాయల చిల్లర విషయంలో తలెత్తిన చిన్నపాటి వివాదం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టేపల్లి ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఓ ఆటో డ్రైవర్‌ను కొంతమంది వ్యక్తులు రోడ్డుపైనే దారుణంగా కొట్టి చంపేశారు. భార్యాపిల్లలు కళ్లముందే వేడుకుంటున్నా వినకుండా, గుంపుగా వచ్చి ఈ దారుణానికి ఒడిగట్టడం స్థానికంగా తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది.

హైదరాబాద్‌లో దారుణం
హైదరాబాద్‌లో దారుణం

స్థానికుల సమాచారం ప్రకారం.. వట్టేపల్లి ప్రాంతానికి చెందిన మహమ్మద్ ముఖర్రమ్ అనే వ్యక్తి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం రూ.10 ఆటో ఛార్జీకిగానూ ఆయన రూ.200 నోటు ఇచ్చాడు. మిగిలిన చిల్లర ఇచ్చే క్రమంలో ఇరువర్గాల మధ్య చిన్నగా మొదలైన మాటల యుద్ధం కాస్తా తీవ్ర వివాదానికి దారితీసింది.

"కేవలం 10 రూపాయల చిల్లర కోసమే ఈ గొడవ మొదలైంది. రూ.10 ఛార్జీకి ముఖర్రమ్ రూ.200 నోటు ఇచ్చాడు. ఆ సమయంలో తనను తాను న్యూస్ రిపోర్టర్‌గా చెప్పుకునే అజీమ్ అనే వ్యక్తి ముఖర్రమ్‌ను తీవ్ర పదజాలంతో దూషించాడు. అంతటితో ఆగకుండా, మరో 6 నుంచి 8 మంది అనుచరులను అక్కడికి పిలిపించాడు. భార్యాపిల్లలు చూస్తుండగానే ముఖర్రమ్‌ను రోడ్డుపై పడేసి విచక్షణారహితంగా కొట్టి చంపేశారు" అని బహదూర్ పురా ఏఐఎంఐఎం (AIMIM) ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ మీడియాకు తెలిపారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు…. ఏఐఎంఐఎం స్థానిక నాయకులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రాంతంలో ఆకతాయిలు, రౌడీషీటర్ల ఆగడాలు మితిమీరిపోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

"వట్టేపల్లి ప్రాంతంలో అజీమ్, షోయబ్ మరికొందరు అనుచరులు రౌడీషీటర్లుగా వ్యవహరిస్తూ గూండాగిరీ చేస్తున్నారు. ఈ ఒక్క నెలలోనే ఇదే రోడ్డుపై జరిగిన రెండో హత్య ఇది. రాజేంద్రనగర్ డీసీపీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వెంటనే స్పందించి నిందితులందరినీ తక్షణమే అరెస్ట్ చేయాలి. ఈ ప్రాంతంలో పోలీస్ పెట్రోలింగ్ పెంచాలి. బాధితుడి కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేము అండగా ఉంటాం," అని ఎమ్మెల్యే ముబీన్ డిమాండ్ చేశారు.

ఈ ఘటనపై రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీస్ అధికారులు వెల్లడించారు. బాధితుడి భౌతికకాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో వట్టపల్లిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More