తెలంగాణలో ఆటో డ్రైవర్లు, ప్రైవేట్ రవాణా రంగ కార్మికులు తమ నిరసన గళాన్ని విప్పారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 23 అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు ఆటోరిక్షా డ్రైవర్ల యూనియన్ల జాయింట్ యాక్షన్ కమిటీ అధికారికంగా ప్రకటించింది. ఈ సమ్మెకు భారతీయ ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ (BPTMM) కూడా తన పూర్తి మద్దతును తెలిపింది.

మీడియా సమావేశంలో జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ, ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల జీవితాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడేళ్ల కాలంలో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక రాష్ట్రంలో సుమారు 200 మందికి పైగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.
ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే డ్రైవర్ల ఆత్మహత్యలకు బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్మికుల హక్కుల కోసం చేపడుతున్న ఈ నిరవధిక పోరాటానికి రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాలని నేతలు విజ్ఞప్తి చేశారు.
బీపీటీఎమ్ఎమ్ జాతీయ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ అల్లూరి మాట్లాడుతూ, ప్రభుత్వం దిగివచ్చి కార్మికుల సమస్యలను పరిష్కరించే వరకు ఈ సమ్మె ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉద్యమానికి తమ సంఘం పూర్తి అండగా ఉంటుందని ఆయన ప్రకటించారు.
ఆటోరిక్షా, ప్రైవేట్ రవాణా రంగ కార్మికుల కోసం తక్షణమే ఒక ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఆటో డ్రైవర్లకు ఏడాదికి ప్రకటించిన రూ. 12,000 ఆర్థిక సాయాన్ని, పాత బాకీలతో సహా వెంటనే ఖాతాల్లో జమ చేయాలన్నారు. గత ప్రభుత్వం ఆటో డ్రైవర్ల కోసం ప్రకటించిన రూ. 5 లక్షల ఉచిత ప్రమాద భీమా పథకాన్ని పునరుద్ధరించి, సమర్థవంతంగా అమలు చేయాలన్నారు.
యాప్ ఆధారిత చట్టవిరుద్ధ బైక్ టాక్సీ సేవలపై తక్షణమే నిషేధం విధించాలన్నారు జేఏసీ నేతలు. ఆయా కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రభుత్వమే ఒక అధికారిక యాప్ను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగినందున దానికి అనుగుణంగా ఆటో, క్యాబ్ మీటర్ ఛార్జీలను పెంచాలన్నారు. కార్మికులకు కనీస ఆదాయం లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
{{/usCountry}}యాప్ ఆధారిత చట్టవిరుద్ధ బైక్ టాక్సీ సేవలపై తక్షణమే నిషేధం విధించాలన్నారు జేఏసీ నేతలు. ఆయా కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రభుత్వమే ఒక అధికారిక యాప్ను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగినందున దానికి అనుగుణంగా ఆటో, క్యాబ్ మీటర్ ఛార్జీలను పెంచాలన్నారు. కార్మికులకు కనీస ఆదాయం లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
{{/usCountry}}రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి తమ ఉపాధి దెబ్బతిన్నదని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆగస్టు 23 అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభమైతే హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం వంటి ప్రధాన నగరాలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.