కాణిపాకం వార్షిక బ్రహ్మోత్సవాలకు వెళ్తున్నారా? 10 నిమిషాలకో బస్సు, భారీగా ఏర్పాట్లు!

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగా వైభవంగా జరగనున్నాయి. సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 10 వరకు నిర్వహించే ఈ వేడుకలకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు.

Published on: Aug 22, 2026, 22:17:44 IST
By , Kanipakam
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమవ్వాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

కాణిపాకం వార్షిక బ్రహ్మోత్సవాలు
కాణిపాకం వార్షిక బ్రహ్మోత్సవాలు

ఈ ఏడాది సెప్టెంబర్ 14 నుండి అక్టోబర్ 10 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కాణిపాకం ఆలయ ఈఓ కార్యాలయంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్, ఆర్‌ అండ్ బి, వైద్య ఆరోగ్య శాఖ, అగ్నిమాపక శాఖలకు చెందిన అధికారులకు కలెక్టర్ కీలక మార్గదర్శకాలు జారీ చేశారు.

ఆర్‌డీఓ, డీఎస్పీ, ఆలయ ఈఓల పర్యవేక్షణలో 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయనున్నారు. వైద్యులు, పారిశుధ్య సిబ్బంది, పోలీసులు, విద్యుత్, అగ్నిమాపక శాఖ సిబ్బంది షిఫ్టుల వారీగా రౌండ్ ది క్లాక్ అందుబాటులో ఉంటారు. వేడుకలన్నీ ఆగమ శాస్త్ర సాంప్రదాయాల ప్రకారం జరగాలని, ప్రోటోకాల్ ఏర్పాట్లను చిత్తూరు ఆర్డీఓ పర్యవేక్షిస్తారని కలెక్టర్ తెలిపారు.

స్థానిక ఎమ్మెల్యే కె. మురళీ మోహన్ మాట్లాడుతూ భక్తుల రక్షణ కోసం 100 సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. క్యూలైన్ల వద్ద అంబులెన్సులు, వీల్ చైర్లు అందుబాటులో ఉంచాలని, ప్రమాదకర విద్యుత్ వైర్లను తనిఖీ చేసి అవసరమైన చోట అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలన్నారు. కాణిపాకం - చిత్తూరు మధ్య ప్రతి 10 నిమిషాలకు ఒక ఆర్టీసీ బస్సు నడపాలని, స్వామివారి వాహన సేవలు రాత్రి 7 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి లోపు ముగిసేలా చూడాలని సూచించారు.

చిత్తూరు ఎస్పీ తుషార్ దూడి మాట్లాడుతూ, ఆలయ ప్రాంగణం, సుప్రభాతం మంటపం, కోనేరు, బస్ స్టాండ్, కళ్యాణకట్ట తదితర ప్రాంతాల్లో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రథోత్సవం, పుష్ప పల్లకి సేవలకు అదనపు పోలీసులను రంగంలోకి దించుతామని స్పష్టం చేశారు.

'24 గంటల పాటు నిఘా ఉంచేలా ఒక సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నాం. డ్రోన్ కెమెరాలు, ఇతర వ్యవస్థలతో పరిసర ప్రాంతాల్లో అనుక్షణం నిఘా కొనసాగుతుంది. భక్తులకు రక్షణగా పోలీసు యంత్రాంగం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది.' అని ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో ఆలయ ఈఓ పెంచల కిషోర్, ఛైర్మన్ ఎం. మణినాయుడు తదితరులు పాల్గొన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More