తెలంగాణలో ఆటోలు బంద్.. డ్రైవర్ల ప్రధాన డిమాండ్లు ఇవే

తెలంగాణలో ఆటో, క్యాబ్, పాఠశాల డ్రైవర్ల దీర్ఘకాలిక డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగా ఆటోలను బంద్ చేయాలని జేఏసీ నిర్ణయించింది.

Published on: Aug 23, 2026, 09:45:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలో ఆటో డ్రైవర్లు, ప్రైవేట్ రవాణా రంగ కార్మికులు తమ నిరసన గళాన్ని విప్పారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 23 అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు ఆటోరిక్షా డ్రైవర్ల యూనియన్ల జాయింట్ యాక్షన్ కమిటీ అధికారికంగా ప్రకటించింది. ఈ సమ్మెకు భారతీయ ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ (BPTMM) కూడా తన పూర్తి మద్దతును తెలిపింది.

తెలంగాణలో ఆటోలు బంద్
తెలంగాణలో ఆటోలు బంద్

మీడియా సమావేశంలో జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ, ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల జీవితాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడేళ్ల కాలంలో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక రాష్ట్రంలో సుమారు 200 మందికి పైగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.

ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే డ్రైవర్ల ఆత్మహత్యలకు బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్మికుల హక్కుల కోసం చేపడుతున్న ఈ నిరవధిక పోరాటానికి రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాలని నేతలు విజ్ఞప్తి చేశారు.

బీపీటీఎమ్ఎమ్ జాతీయ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ అల్లూరి మాట్లాడుతూ, ప్రభుత్వం దిగివచ్చి కార్మికుల సమస్యలను పరిష్కరించే వరకు ఈ సమ్మె ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉద్యమానికి తమ సంఘం పూర్తి అండగా ఉంటుందని ఆయన ప్రకటించారు.

ఆటోరిక్షా, ప్రైవేట్ రవాణా రంగ కార్మికుల కోసం తక్షణమే ఒక ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఆటో డ్రైవర్లకు ఏడాదికి ప్రకటించిన రూ. 12,000 ఆర్థిక సాయాన్ని, పాత బాకీలతో సహా వెంటనే ఖాతాల్లో జమ చేయాలన్నారు. గత ప్రభుత్వం ఆటో డ్రైవర్ల కోసం ప్రకటించిన రూ. 5 లక్షల ఉచిత ప్రమాద భీమా పథకాన్ని పునరుద్ధరించి, సమర్థవంతంగా అమలు చేయాలన్నారు.

యాప్ ఆధారిత చట్టవిరుద్ధ బైక్ టాక్సీ సేవలపై తక్షణమే నిషేధం విధించాలన్నారు జేఏసీ నేతలు. ఆయా కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రభుత్వమే ఒక అధికారిక యాప్‌ను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగినందున దానికి అనుగుణంగా ఆటో, క్యాబ్ మీటర్ ఛార్జీలను పెంచాలన్నారు. కార్మికులకు కనీస ఆదాయం లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి తమ ఉపాధి దెబ్బతిన్నదని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆగస్టు 23 అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభమైతే హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం వంటి ప్రధాన నగరాలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More