చిన్నారుల ఆరోగ్యం కోసం తెలంగాణలో కొత్త పథకం.. బాల భరోసా!

తెలంగాణలో చిన్నారుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకువస్తోంది. అదే బాల భరోసా స్కీమ్. పిల్లల ఆరోగ్యమే లక్ష్యంగా ఇది ఉండనుంది.

Published on: Nov 13, 2025, 12:27:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

సంక్షేమ పథకాల అమలులో భాగంగా మరో కొత్త పథకాన్ని తీసుకువస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్. ఐదు సంవత్సరాలలోపు పిల్లల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా బాల భరోసా అనే సరికొత్త పథకానికి శ్రీకారం చుడుతోంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్న చిన్నారులు మెరుగైన వైద్య సేవలను ఉచితంగా అందించనున్నారు. దీని ద్వారా పిల్లల ఆరోగ్యానికి ప్రభుత్వం అండగా ఉండనుంది. త్వరలోనే బాల భరోసా పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖలు సంయుక్తంగా ఈ స్కీమ్‌ను పర్యవేక్షిస్తాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

కొన్ని రోజుల కిందట రాష్ట్రంలోని అంగన్‌వాడీ సిబ్బంది చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై సర్వే నిర్వహించారు. దానికి సంబంధించిన రిపోర్టులు ప్రభుత్వం వద్దకు వెళ్లాయి. సర్వేలో దాదాపు 8 లక్షల మంది చిన్నారులు పలు రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టుగా తెలిసింది. అనేక మంది రక్తహీనత, పోషకాహార లోపంతో బాధపడుతున్నట్టుగా గుర్తించారు. మరికొందరేమో వినికిడి, దృష్టి లోపాలు, సరైన ఎదుగుదల లేకపోవడం లాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు.

ఇలా రకరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న చిన్నారులను గుర్తించి.. అండగా నిలిచేందుకు ప్రభుత్వం బాల భరోసా పథకం ప్రారంభిస్తోంది. ఈ స్కీమ్‌లో భాగంగా వైకల్యంతో బాధపడే చిన్నారులకు ఉచితంగా ఆపరేషన్ చేస్తారు. వినికిడి సమస్య ఉన్న వారికి అవసరమైన పరికరాలను అందిస్తారు. ఇతర వైద్య సేవలు కూడా ఫ్రీగా ఉంటాయి.

బాల భరోసా పథకం ఆరోగ్య శ్రీకి అనుసంధానించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని వ్యాధులు ఉంటే.. చికిత్స ఖర్చులను సీఎంఆర్ఎఫ్ నుంచి చెల్లించేలా ఏర్పాట్లు జరుగుతాయి. కేంద్ర ప్రభుత్వ పథకం రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమాన్ని కూడా ఇందులో విలీనం చేస్తారు.

తెలంగాణ ప్రభుత్వం ఈ పథకం అమలును పర్యవేక్షించేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తోంది. దీంతో ప్రతీ చిన్నారి మెడికల్ రిపోర్టులు, వారికి అందిస్తున్న ట్రీట్‌మెంట్, దాని పురోగతి ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తారు. ఈ పథకంతో లక్షలాది మంది చిన్నారుల జీవితాల్లో వెలుగులు రానున్నాయి. చిన్న వయసులో మెరుగైన వైద్యం తీసుకుని.. సమస్య నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More