Bandi Bhageerath Case : బండి భగీరథ్ కేసు.. బాధితురాలి పుట్టిన తేదీలపై హైకోర్టు ప్రశ్నలు!
Bandi Bhageerath Case : పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ కేసుపై హైకోర్టు విచారణ చేసింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
పోక్సో (POCSO) కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేసింది. ఈ కేసులో తక్షణ అరెస్ట్ నుంచి ఆయనకు ఊరట లభిస్తుందా లేదా అన్న అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది.

బండి భగీరథ్ తరపు న్యాయవాదులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు తాజాగా విచారించింది. కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, పూర్తిస్థాయి విచారణను వారం రోజుల తర్వాత చేపడతామని స్పష్టం చేసింది. ముందస్తు బెయిల్‌పై వచ్చే వారం విచారణ చేస్తామని తెలిపింది. మధ్యంతర బెయిల్‌పై తీర్పును మే 15వ తేదీన వెల్లడిస్తామని చెప్పింది.
ప్రధాన బెయిల్ పిటిషన్ విచారణకు సమయం పట్టే అవకాశం ఉన్నందున, అంతవరకు తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా మధ్యంతర బెయిల్ కల్పించాలని భగీరథ్ తరపు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. కోర్టు తుది తీర్పు ఇచ్చే వరకు అరెస్ట్ నుంచి స్టే ఇవ్వాలని కోరడం ఈ కేసులో ఇప్పుడు కీలకంగా మారింది. అరెస్ట్ నుంచి తాత్కాలిక రక్షణ ఇవ్వాలనే అభ్యర్థనపై స్పందించిన కోర్టు, ఈ అంశంపై నిర్ణయాన్ని మే 15వ తేదీనాటికి వాయిదా వేసింది.
విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 2021లో బాధితురాలి వయసు 15గా ఉందని భగీరథ్ తరఫున న్యాయవాది తెలిపారు. ప్రస్తుత ఛార్జ్‌షీట్‌లోనూ ఆమె వయసు 15గా ఉందన్నారు. ఛార్జ్‌షీట్, పాన్‌కార్డులో పుట్టిన తేదీలు ఒక్కోలాగా ఎందుకు ఉన్నాయని కోర్టు అడిగింది. బాధితురాలి వయసుపై వెరిఫికేషన్ చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.
బండి భగీరథ్, బుధవారం జరగాల్సిన పోలీసు విచారణకు గైర్హాజరయ్యాడు. తన వ్యక్తిగత కారణాల దృష్ట్యా అధికారుల ముందుకు రాలేకపోతున్నానని పేర్కొంటూ పేట్ బషీరాబాద్ పోలీసులకు ఒక ఈ మెయిల్ పంపాడు. కేసుకు సంబంధించి కొన్ని కీలక ఆధారాలను సేకరించాల్సి ఉందని, అందుకోసం తనకు మరో రెండు రోజుల సమయం కావాలని కోరాడు. దర్యాప్తునకు సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, సంబంధిత అధికారుల ఎదుట తప్పకుండా హాజరవుతానని స్పష్టం చేశాడు. వ్యక్తిగత కారణాల వల్ల బుధవారం హాజరు కాలేనని, విచారణ కోసం మరొక తేదీని చెప్పాలని విజ్ఞప్తి చేశాడు..
మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఈ కేసును సీరియస్‌గా తీసుకుని, సమగ్ర విచారణ కోసం కుకట్‌పల్లి డీసీపీ రీతిరాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు.
17 ఏళ్ల బాలికను మభ్యపెట్టి, ఫామ్‌హౌస్‌లలో లైంగిక దాడికి పాల్పడ్డారన్న ఫిర్యాదుతో మే 8న ఈ కేసు నమోదైంది. మరోవైపు భగీరథ్ తరపున ఇది 'హనీ ట్రాప్' అని, తనను బ్లాక్ మెయిల్ చేసి రూ. 5 కోట్లు డిమాండ్ చేస్తున్నారని కరీంనగర్‌లో ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం పోలీసులు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


