Summer Special Trains : ప్రయాణికులకు అలర్ట్ - ఏపీ, తెలంగాణ మీదుగా ప్రత్యేక రైళ్లు..! రూట్స్ ఇవే

Summer Special Trains 2026 : వేసవి సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నాందేడ్, విశాఖపట్నం నుంచి నిజాముద్దీన్‌కు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ రైళ్ల షెడ్యూల్, స్టాపింగ్‌ల పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి…

Published on: May 14, 2026, 07:41:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Summer Special Trains 2026 : వేసవి సెలవుల వేళ ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే (SCR) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల ఇబ్బందులను తొలగించేందుకు, అదనపు రద్దీని క్లియర్ చేసేందుకు గాను వివిధ గమ్యస్థానాల మధ్య మరిన్ని 'సమ్మర్ స్పెషల్' రైళ్లను ప్రకటించింది. ముఖ్యంగా నాందేడ్స విశాఖపట్నం నుంచి ఢిల్లీ (నిజాముద్దీన్) వైపు వెళ్లే వారికి ఈ నిర్ణయం పెద్ద ఊరటనివ్వనుంది.

ప్రత్యేక రైళ్లు
ప్రత్యేక రైళ్లు

నాందేడ్ - నిజాముద్దీన్ స్పెషల్ రైళ్లు:

మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి నిజాముద్దీన్ మధ్య ప్రత్యేక సర్వీసులను రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చింది.

  • రైలు నంబర్ 07660: మే 22న (శుక్రవారం) ఉదయం 06:35 గంటలకు నాందేడ్‌లో బయలుదేరి... మరుసటి రోజు (శనివారం) మధ్యాహ్నం 14:30 గంటలకు నిజాముద్దీన్ చేరుకుంటుంది.
  • రైలు నంబర్ 07661: తిరుగు ప్రయాణంలో మే 25న (సోమవారం) తెల్లవారుజామున 01:25 గంటలకు నిజాముద్దీన్‌లో బయలుదేరి, మరుసటి రోజు (మంగళవారం) ఉదయం 09:45 గంటలకు నాందేడ్ చేరుకుంటుంది.
  • ఈ రైళ్లు ఆదిలాబాద్, నాగ్‌పూర్, రాణి కమలాపతి, ఝాన్సీ మరియు ఆగ్రా కాంట్ స్టేషన్లలో ఆగుతాయి. ఇందులో కేవలం స్లీపర్ మరియు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు మాత్రమే ఉంటాయి.

విశాఖపట్నం - నిజాముద్దీన్ స్పెషల్ రైళ్లు:

విశాఖపట్నం నుంచి నిజాముద్దీన్‌కు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రధాన స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తాయి.

  • రైలు నంబర్ 08513: మే 21న (గురువారం) సాయంత్రం 17:40 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి, శనివారం ఉదయం 11:40 గంటలకు నిజాముద్దీన్ చేరుకుంటుంది.
  • రైలు నంబర్ 08514: తిరుగు ప్రయాణంలో మే 24న (ఆదివారం) రాత్రి 23:55 గంటలకు నిజాముద్దీన్‌లో బయలుదేరి, మంగళవారం రాత్రి 22:40 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
  • దువ్వాడ, అనకాపల్లి, తుని, రాజమండ్రి, విజయవాడ, బలార్షా, నాగ్‌పూర్, రాణి కమలాపతి, ఝాన్సీ మరియు ఆగ్రా కాంట్ స్టేషన్లలో ఈ రైలు ఆగుతాయి. ఇవి కూడా స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లతో నడుస్తాయి.

ప్రయాణికులు ఈ ప్రత్యేక సర్వీసులను వినియోగించుకుని తమ ప్రయాణాలను సురక్షితంగా సౌకర్యవంతంగా ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. టికెట్ బుకింగ్ మరియు ఇతర వివరాల కోసం ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్ లేదా రైల్వే విచారణ కేంద్రాన్ని సంప్రదించవచ్చు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More