రాష్ట్రంలో గత కొంత కాలంగా బీసీ రిజర్వేషన్ల చుట్టు తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో 9ని తీసుకువచ్చింది. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ జీవోపై న్యాయస్థానం స్టే విధించింది. దీంతో స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడింది.

హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. అయితే ఇక్కడ కూడా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. 50 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. ఏమైనా మెరిట్స్ ఉంటే హైకోర్టులో వాదనలు వినిపించుకోవచ్చని సూచించింది. ఫలితంగా రిజర్వేషన్ల పెంపు అంశం మరింత సంక్లిష్టంగా మారినట్లు అయింది.
తాజా పరిణామాలపై బీసీ సంఘాలు తీవ్రస్థాయిలో ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ జీవోపై హై కోర్టు స్టే ఇవ్వడంతో పాటు సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వ పిటిషన్ ను పక్కన పెట్టడంతో బీసీ సంఘాలు తమ పోరాటాన్ని ఉద్ధృతం చేసే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగా ఈనెల 18వ తేదీన బీసీ సంఘాల జేఏసీ రాష్ట్ర బంద్ కు పిలుపినిచ్చింది. అందరూ కలసి బంద్‌ను విజయవంతం చేయాలని కోరింది.
అన్ని పార్టీల మద్దతు..!
ఈ బంద్ కు బీసీ సంఘాల జేఏసీ అన్ని పార్టీల మద్దతు కోరింది. వీరి విజ్ఞప్తిని పరిశీలించిన బీజేపీ, బీఆర్ఎస్ తో పాటు అధికార కాంగ్రెస్ పార్టీ కూడా బంద్ కు మద్దతు ప్రకటించాయి. కామారెడ్డి డిక్లరేషన్ కు కాంగ్రెస్ కట్టుబడి ఉందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తేలేదన్నారు.
ఈ బంద్‌కు వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించి సహకరించాలని బీసీ సంఘాల జేఏసీ నేతలు కోరారు. సంపూర్ణంగా మద్దతు తెలిపి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రాజ్యాంగ సవరణ ద్వారానే బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ విషయంలో బీజేపీపై మరింత ఒత్తిడి తీసుకువస్తామని... పార్లమెంట్ లో పోరాడేందుకు కాంగ్రెస్ పై కూడా పోరాడుతామని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు
{{/usCountry}}ఈ బంద్‌కు వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించి సహకరించాలని బీసీ సంఘాల జేఏసీ నేతలు కోరారు. సంపూర్ణంగా మద్దతు తెలిపి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రాజ్యాంగ సవరణ ద్వారానే బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ విషయంలో బీజేపీపై మరింత ఒత్తిడి తీసుకువస్తామని... పార్లమెంట్ లో పోరాడేందుకు కాంగ్రెస్ పై కూడా పోరాడుతామని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు
{{/usCountry}}రేపటి బంద్ తో రాష్ట్రంలోని బడులు, కాలేజీలు తెరిచి ఉంటాయా లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే బంద్ కు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వటమే కాకుండా ఎమ్మార్పీఎస్ తో పాటు అనేక ప్రజాసంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో పలు ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ముందుగానే సెలవు ప్రకటించే యోచనలో ఉన్నాయి. ఇదే జరిగితే ఆదివారంతో పాటు సోమవారం(దీపావళి) కూడా సెలవులు ఉండున్నాయి.
శాంతియుతంగా బంద్ జరుపుకోండి - డీజీపీ
రేపటి బంద్‌పై రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. బంద్ ను శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. బంద్ పేరుతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. పోలీస్ సిబ్బంది, నిఘా బృందాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని… బంద్ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి సూచించారు.