UPSC Free Coaching : యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్-2027 ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
UPSC Civils Free Coaching : యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అవుతున్నారా? తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఉచిత శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానిస్తోంది. వెంటనే అప్లై చేయండి.
తెలంగాణ ప్రభుత్వ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ (TGBCESDTC) యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్) 2027 ఉచిత శిక్షణ కార్యక్రమానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ కోచింగ్ కార్యక్రమం 2026 ఆగస్టు 24 నుంచి 2027 వరకు హైదరాబాద్‌లో నిర్వహిస్తారు. మొత్తం 150 మంది అభ్యర్థులకు శిక్షణ అందిస్తారు. అందులో 100 మంది ఓపెన్ కేటగిరీ ద్వారా 50 మంది తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ప్రిలిమ్స్ అర్హత పొందిన అభ్యర్థుల నుంచి ఎంపిక చేస్తారు.
ఎంపికైన అభ్యర్థులకు కల్పించే సౌకర్యాలు
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫ్రీ కోచింగ్
{{^htLoading}} {{/htLoading}}
ఎంపికైన అభ్యర్థులకు సౌకర్యాలు ఉంటాయి. నెలకు రూ.5,000 స్టైపెండ్ (ప్రభుత్వ నిబంధనల మేరకు) అందిస్తారు. అంతేకాదు ఒకేసారి రూ.5,000 పుస్తక భృతి ఇస్తారు. గ్రంథాలయ సౌకర్యం, నిపుణుల ద్వారా ప్రత్యేక శిక్షణ ఉంటుంది. స్టడీ మెటీరియల్, మాక్ టెస్టులు, మార్గదర్శకత్వం చేస్తారు.
అర్హతలు
ఉచిత సివిల్స్ శిక్షణకు అప్లై చేయాలనుకునేవారు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతం వారైతే రూ.1.50 లక్షలలోపు ఉండాలి. పట్టణ ప్రాంతానికి చెందినవారికి రూ.2.00 లక్షలలోపు ఉండాలి. తెలంగాణ నివాసి కావాలి. భారతీయ పౌరుడై ఉండాలి. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్–2027 నిబంధనల ప్రకారం వయోపరిమితి ఉండాలి.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తుల ప్రారంభం: 15-07-2026
ఆన్‌లైన్ దరఖాస్తులు: 17-07-2026 నుంచి 07-08-2026 వరకు
హాల్ టికెట్ల డౌన్‌లోడ్: 13-08-2026 నుంచి
స్క్రీనింగ్ టెస్ట్: 16-08-2026
ఫలితాలు: 19-08-2026
ధ్రువపత్రాల పరిశీలన: 21-08-2026 నుంచి
తరగతుల ప్రారంభం: 24-08-2026
ఆసక్తి గల అభ్యర్థులు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని డైరెక్టర్ డా.మామిడి హరికృష్ణ తెలిపారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.