ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ -20 కి సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. తాజాగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా… హాల్ టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. నవంబర్ 30వ తేదీన దేశవ్యాప్తంగా ఈ ఎగ్జామ్ నిర్వహిస్తారు. తెలంగాణతో పాటు ఏపీలోనూ పరీక్షా కేంద్రాలున్నాయి.
హాల్ టికెట్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి:
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://www.allindiabarexamination.com/ వెబ్ సైట్ లోకి వెళ్లండి.
- హోం పేజీలో కనిపించే లాగిన్ పై క్లిక్ చేయాలి. మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్ వర్డ్ వివరాలను ఎంటర్ చేయాలి.
- అడ్మిట్ కార్డు ఆప్షన్ పై క్లిక్ చేస్తే…మీ హాల్ టికెట్ ఓపెన్ అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి హాల్ టికెట్ కాపీని పొందవచ్చు.

{{^htLoading}} {{/htLoading}}
ఆలిండియా బార్ ఎగ్జామినేషన్లో ఉత్తీర్ణత సాధించాలంటే జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు కనీసం 45 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులు పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి కనీస మార్కులు 40 శాతంగా ఉంది. సిలబస్ ప్రకారం AIBE 20లో 19 అంశాలు నుంచి ప్రశ్నలు వస్తాయి. మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. మూడు గంటల సమయం ఉంటుంది.
ఏఐబీఈ ఎగ్జామ్ - మార్కుల కేటాయింపు:
- రాజ్యాంగ చట్టం (Constitutional Law): 10 ప్రశ్నలు
- ఐ.పీ.సీ(ఇండియన్ పీనల్ కోడ్), (కొత్త) భారతీయ న్యాయ సంహిత: 8 ప్రశ్నలు
- సీఆర్పీసీ (క్రిమినల్ ప్రొసీజర్ కోడ్), (కొత్త) భారతీయ నగరిక్ సురక్ష సంహిత: 10
- సీ.పీ.సీ.(సివిల్ ప్రొసీజర్ కోడ్): 10 ప్రశ్నలు
- ఎవిడెన్స్ యాక్ట్ (భారతీయ శక్ష అధినియం): 8 ప్రశ్నలు
- మధ్యవర్తిత్వ చట్టంతో సహా ప్రత్యామ్నాయ వివాద పరిష్కారం: 4 ప్రశ్నలు
- కుటుంబ చట్టం: 8 ప్రశ్నలు
- ప్రజా ప్రయోజన వ్యాజ్యం: 4 ప్రశ్నలు
- అడ్మినిస్ట్రేషన్ చట్టం: 3 ప్రశ్నలు
- BCI నిబంధనల ప్రకారం ప్రొఫెషనల్ ఎథిక్స్ అండ్ ప్రొఫెషనల్ మిస్కాండక్ట్ కేసులు: 4 ప్రశ్నలు
- కంపెనీ లా : 2 ప్రశ్నలు
- పర్యావరణ చట్టం: 2 ప్రశ్నలు
- సైబర్ లా : 2 ప్రశ్నలు
- కార్మిక, పారిశ్రామిక చట్టం: 4 ప్రశ్నలు
- మోటారు వాహన చట్టం, వినియోగదారుల రక్షణ చట్టంతో సహా లా ఆఫ్ టోర్ట్: 5 ప్రశ్నలు
- పన్నుకు సంబంధించిన చట్టం: 4 ప్రశ్నలు
- కాంట్రాక్ట్ చట్టం, నిర్దిష్ట ఉపశమనం, ఆస్తి చట్టాలు, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ చట్టం: 8 ప్రశ్నలు
- భూసేకరణ చట్టం: 2 ప్రశ్నలు
- మేథో సంపత్తి చట్టాలు: 2 ప్రశ్నలు
{{^htLoading}} {{/htLoading}}