Hyderabad Police : ఉచితంగా రూ.5 వేలంటూ సైబర్ మోసాలు…. జాగ్రత్త! ఆ లింక్స్ పై క్లిక్ చేయకండి
ఉచితంగా రూ.5 వేలంటూ సైబర్ మోసాలు జరుగుతున్నాయని హైదరాబాద్ సీపీ సజ్జనార్ సూచించారు. ఇలాంటి వాటిపట్ల ప్రజలంతా అవగాహన కలిగి ఉండాలన్నారు. అనధికారిక లింకులపై క్లిక్ చేయవద్దని హెచ్చరించారు.
సంక్రాంతి, గణతంత్ర దినోత్సవాల వేళ ప్రజల ఆనందాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడలతో వస్తున్నారని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ప్రస్తుతం వాట్సాప్‌లో "ఫోన్ పే రిపబ్లిక్ డే మెగా గిఫ్ట్", "సంక్రాంతి కానుక" అంటూ కొన్ని నకిలీ లింకులు విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయని చెప్పారు. వీటిని క్లిక్ చేస్తే రూ. 5,000 ఉచితంగా పొందవచ్చని సైబర్ నేరగాల్లు ఆశపెడుతున్నారని హెచ్చరించారు.

ఆలోచించండి - సీపీ సజ్జనార్
“మొదట ఇది నకిలీ అనుకున్నాను, కానీ నిజంగానే నాకు రూ. 5,000 వచ్చింది! మీరు కూడా ప్రయత్నించి చూడండి! అంటూ ఒక లింక్‌ను షేర్ చేస్తున్నారు. ఇది అమాయకులను బుట్టలో వేయడానికి నేరగాళ్లు వాడే ఒక సైకలాజికల్ ట్రిక్ మాత్రమే. మీకు తెలిసిన వారి నుండి లేదా గ్రూపుల నుండి ఇలాంటి సందేశాలు వస్తే ఒక్క నిమిషం ఆలోచించండి” అంటూ హైదరాబాద్ సీపీ సజ్జనార్ సూచించారు.
ఆ మెసేజ్ చివరన ఉండే లింకులను గమనించాలని సజ్జనార్ పేర్కొన్నారు. అవి http://fdgc.lusvv.xyz లేదా http://iom.qmtyw.xyz వంటి వింత అక్షరాలతో ఉంటాయని వివరించారు. ఇవి అధికారిక ఫోన్ పే లింకులు కావని గ్రహించాలని హెచ్చరించారు.
“ఆశపడి ఆ లింక్ క్లిక్ చేస్తే మీ ఫోన్‌లోకి ప్రమాదకరమైన మాల్వేర్ ప్రవేశించే అవకాశం ఉంది. తద్వారా మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ పిన్, పాస్‌వర్డ్‌లు తస్కరించి.. క్షణాల్లో మీ బ్యాంక్ ఖాతాను ఖాళీ చేస్తారు. ఫోన్ పే, గూగుల్ పే లేదా మరే ఇతర సంస్థ అయినా ఇలా వాట్సాప్ లింకుల ద్వారా డబ్బులు పంచదు. ఏ ఆఫర్ ఉన్నా అది వారి అధికారిక యాప్‌లోనే కనిపిస్తుంది” అని సజ్జనార్ తెలిపారు.
ఒకవేళ పొరపాటున ఎవరైనా ఈ లింక్ క్లిక్ చేసి డబ్బులు పోగొట్టుకుంటే, వెంటనే 1930 నెంబర్‌కు కాల్ చేయాలని పోలీస్ కమిషనర్ సజ్జనార్ సూచించారు. లేదా http://cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలన్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

