భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగా లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్లలో జరిగిన కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి విస్తృత సమావేశంలో పాల్గొన్నారు మంత్రి పొంగులేటి. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని, బృందాలుగా గ్రామ, మండల స్థాయిలో విస్తృతంగా పనిచేయాలని నాయకులను, కార్యకర్తలను కోరారు.

'ప్రజాపాలనలో అన్ని వర్గాలను అక్కున చేర్చుకుని సంక్షేమం, అభివృద్ధి జోడెడ్లలా ముందుకు సాగుతున్నాం. దశాబ్దాలుగా ఉన్న భూసమస్యలకు శాశ్వత పరిష్కార మార్గం చూపిస్తూ రాష్ట్రంలోని రైతులకు, సామాన్యులకు భూసమస్యల నుంచి ఊరట కలిగిస్తున్నది ప్రజా ప్రభుత్వం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తరతరాలుగా పోడు చేసుకుంటూ, వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న వారి భూసమస్యల పరిష్కారంపై, అటవీ భూములకు సంబంధించి కొన్ని అంశాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి. కేంద్రంతో సంప్రదించి వాటి పరిష్కారానికి కృషి చేస్తాం. ప్రభుత్వం దానిపై ఆలోచన చేసి కార్యరూపం దాల్చేలా త్వరలోనే తీపి కబురు ప్రకటిస్తాం.' అని పొంగులేటి చెప్పారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా పాలేరు, సత్తుపల్లి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కట్టుకాచారంలో సుమారు రూ. 25 లక్షలతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపనతో పాటు మండలంలోని 31 మంది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.
నారాయణపురంలో శ్రీ షిరిడి సాయి జన మంగళం ట్రస్టు సహకారంతో ఏర్పాటు చేసిన క్యాన్సర్ స్క్రీనింగ్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్తుపల్లి మండలం బేతుపల్లి గంగారం గ్రామంలో తాన్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామీణ ఆరోగ్య కేంద్రం, ల్యాబొరేటరీలను సందర్శించి, స్వయంగా రక్తపరీక్ష చేయించుకున్నాను. రోగులతో మాట్లాడి అక్కడ అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తే, తాన్లా ఫౌండేషన్ తరఫున ఉదయ్ కుమార్ రెడ్డి తన సొంత నిధులతో సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో రూ.300 కోట్లతో 5,000 ఇళ్లను నిర్మించి ఇస్తానని ముందుకు వచ్చారని మంత్రి పొంగులేటి చెప్పారు. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రజా ప్రభుత్వం ఒకవైపు కృషి చేస్తుండగా.. దాతృత్వ సంస్థలు కూడా ప్రభుత్వంతో చేతులు కలపడం అభినందనీయమన్నారు. దసరా పండుగ రోజున ఈ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ మహోత్సవాన్ని నిర్వహించనున్నట్టుగా ప్రకటించారు.
{{/usCountry}}రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తే, తాన్లా ఫౌండేషన్ తరఫున ఉదయ్ కుమార్ రెడ్డి తన సొంత నిధులతో సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో రూ.300 కోట్లతో 5,000 ఇళ్లను నిర్మించి ఇస్తానని ముందుకు వచ్చారని మంత్రి పొంగులేటి చెప్పారు. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రజా ప్రభుత్వం ఒకవైపు కృషి చేస్తుండగా.. దాతృత్వ సంస్థలు కూడా ప్రభుత్వంతో చేతులు కలపడం అభినందనీయమన్నారు. దసరా పండుగ రోజున ఈ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ మహోత్సవాన్ని నిర్వహించనున్నట్టుగా ప్రకటించారు.
{{/usCountry}}ఇక సత్తుపల్లి మున్సిపాలిటీలో 12వ వార్డు ద్వారకాపురి కాలనీలో రూ. 40 లక్షలతో సీసీరోడ్లు, డ్రైనేజీలు, రూ. 40.50 లక్షలతో 14వ వార్డు గాంధీనగర్ లో సీసీరోడ్లు, డ్రైనేజీలు, రూ. 50 లక్షలతో 1వ వార్డు గుడిపాడులో సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేశారు. అదే విధంగా సత్తుపల్లి నియోజకవర్గం తల్లాడ మండలం పినపాకలో అర్హులైన 79 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేశారు.