హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో బాంబు దాడులు జరగవచ్చని పేర్కొంటూ వచ్చిన ఒక బెదిరింపు ఈమెయిల్ నేపథ్యంలో, హైదరాబాద్ నగర పోలీసులు వెంటనే అప్రమత్తమై భద్రతా చర్యలను చేపట్టారు. సందేహాస్పద ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించడంతో పాటు, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసుల పహారాను మరింత పెంచారు. ఈ బెదిరింపు ఈమెయిల్‌కు బాధ్యులైన వారిని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు.

వదంతులను నమ్మవద్దని, వాటిని ప్రచారం చేయవద్దని, ప్రజలు ప్రశాంతంగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీసులు కోరారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా లేదా ఎవరూ పక్కన లేకుండా వస్తువులు కనిపిస్తే వెంటనే 112 నంబర్‌కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ పోలీసులు 24×7 అందుబాటులో ఉంటారని, ప్రతి పౌరుడి భద్రతను కాపాడటమే ప్రాథమిక బాధ్యత అని స్పష్టం చేశారు.
బెదిరింపు మెయిల్
26/11 ముంబై ఉగ్రదాడులు హైదరాబాద్‌లో పునరావృతమవుతాయని, కనీసం 300 మందిని చంపుతామని హెచ్చరిస్తూ వచ్చిన ఒక ఉగ్రవాద బెదిరింపు ఈమెయిల్ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు హై అలర్ట్‌లో ఉన్నారు. అధికారులకు “లష్కర్-ఎ-తైబా” అనే శీర్షికతో ఒక ఇమెయిల్ అందింది. దానిని పంపిన వ్యక్తి, తాను లష్కర్-ఎ-తైబా అనే ఉగ్రవాద సంస్థతో సంబంధం కలిగి ఉన్నానని పేర్కొన్నాడు. కనీసం 300 మందిని చంపే ఉద్దేశంతో కాచిగూడలోని హోటల్ టూరిస్ట్ ప్లాజా, కాచిగూడ రైల్వే స్టేషన్‌లో బాంబు పేలుళ్లకు పాల్పడతామని బెదిరించాడు.
తమ నాయకుడు లతీఫ్ భట్, ఇతర సహచరులను చంపినందుకు ప్రతీకారం తీర్చుకోవడానికే ఈ దాడులు చేస్తున్నామని తెలిపాడు. 2008 నవంబర్ 26న జరిగిన ముంబై ఉగ్రవాద దాడుల తరహాలోనే హైదరాబాద్‌లో పునరావృతం చేస్తామని పంపిన వ్యక్తి బెదిరించాడు.
బెదిరింపు ఇమెయిల్ వచ్చిన వెంటనే ముందుజాగ్రత్త భద్రతా చర్యలు చేపట్టారు పోలీసులు. వదంతులను నమ్మవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేష్ మురళీధర్ భగవత్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఇమెయిల్ పింపిన వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.
{{/usCountry}}బెదిరింపు ఇమెయిల్ వచ్చిన వెంటనే ముందుజాగ్రత్త భద్రతా చర్యలు చేపట్టారు పోలీసులు. వదంతులను నమ్మవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేష్ మురళీధర్ భగవత్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఇమెయిల్ పింపిన వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.
{{/usCountry}}ABOUT THE AUTHOR
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.