Medchal HIV Injection Case : పెళ్లికి నిరాకరించటంతో ఘోరం - HIV ఇంజెక్షన్‌ ఇచ్చిన ప్రియుడు, సూసైడ్ చేసుకున్న యువతి..!

Medchal HIV Injection Case: హైదరాబాద్‌ లోని పోచారం ఐటీ కారిడార్‌లో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పెళ్లికి నిరాకరించిందనే కారణంతో ఇటీవలే ప్రియుడు… HIV ఇంజెక్షన్‌ ఇచ్చాడు. తీవ్రమైన మనోవేదనకు గురైన సదరు యువతి ఇవాళ ఆత్మహత్యకు పాల్పడింది.

Published on: Apr 10, 2026 4:39 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Medchal HIV Injection Case: హైదరాబాద్‌లో అత్యంత దారుణమైన ఘటన వెలుగు చూసింది. ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించటంతో ప్రియుడు… హెచ్ఐవీ ఇంజెక్షన్ ఇచ్చాడు. ఈ ఘటన ఇటీవలే జరగగా… తాజాగా సదరు యువతి ఇవాళ సూసైడ్ చేసుకుంది. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

HIV ఇంజెక్షన్‌ ఇచ్చిన ప్రియుడు (Representative Image) (pixel image)
HIV ఇంజెక్షన్‌ ఇచ్చిన ప్రియుడు (Representative Image) (pixel image)

ప్రాథమిక వివరాల ప్రకారం… ఈ ఘోర ఘటన పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. జనగామ జిల్లాకు చెందిన యువకుడు నగరంలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అతని తల్లిదండ్రులిద్దరూ హెచ్‌ఐవీ బాధితులు. తండ్రి గతంలోనే మరణించాడు. అయితే సదరు యువకుడు…. సమీప బంధువైన యువతిని ప్రేమించగా… పెళ్లికి పెద్దలు అంగీకరించారు.

పెళ్లి క్యాన్సిల్ కావటంతో…

తల్లిదండ్రుల పూర్వపరాలు తెలిసిన నేపథ్యంలో… పెళ్లికి సిద్ధమైన యువకుడికి కూడా యువతి కుటుంబ సభ్యులు రక్త పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల్లో యువకుడికి కూడా హెచ్‌ఐవీ ఉన్నట్లు తేలింది. దీంతో యువతి కుటుంబ సభ్యులు ఈ పెళ్లిని రద్దు చేసుకున్నారు.

చాలా కాలంగా ప్రేమిస్తుండగా… సడన్ గా పెళ్లి క్యాన్సిల్ కావటంతో సదరు యువకుడు… క్రూరంగా ఆలోచించాడు. యువతికి కూడా హెచ్‌ఐవీ పాజిటివ్‌ ఉంటే మరొకరికి ఇవ్వలేరని… అప్పుడు తనతోనే వివాహం చేస్తారని కుట్ర పన్నాడు. గత నెల 11న సిరంజీ కొనుగోలు చేసి…. అందులో తన రక్తాన్ని ఎక్కించాడు. ఆ తర్వాత యువతి ఇంటికి వెళ్లాడు. మరోసారి పెళ్లి గురించి మాట్లాడాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో తన వెంట తెచ్చుకున్న సిరంజీలోని రక్తాన్ని ఆమెకు బలవంతంగా ఎక్కించి పరారయ్యాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

తన శరీరంలోకి ప్రాణాంతకమైన రక్తం ప్రవేశించిందన్న భయం సదరు యువతిని వెంటాడుతూ వచ్చింది. తన జీవితం నాశనమైందన్న ఆవేదనతో…. మనోవేదనతో ఇవాళ ఇంట్లోనే ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. యువతి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రియుడు మనోహర్ జైలులో ఉన్నాడు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More