BRAOU Admissions 2026 : అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, పీజీ అడ్మిషన్లు - కొత్త నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు తేదీలు

BRAOU Admission Notification 2026 : అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ ్యింది. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు పొందొచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులకు ఆగస్టు 7 చివరి తేదీ.

Published on: Jun 21, 2026, 10:54:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

BRAOU Admission Notification 2026 : అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, పీజీ,డిప్లోమా ప్రవేశాలపై ప్రకటన వచ్చేసింది. ఈ ఏడాదికి సంబంధించిన కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు https://www.braouonline.in/ వెబ్ సైట్ లోకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ యూజీ, పీజీ, డిప్లొమా మరియు సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలు తీసుకోవచ్చు.

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ ప్రవేశాలు - నోటిఫికేషన్ విడుదల
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ ప్రవేశాలు - నోటిఫికేషన్ విడుదల

అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ ద్వారా డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో చేరవచ్చు. ఇక పీజీలో చూస్తే ఎంఏ, ఎంకామ్‌, ఎంఎస్సీ, ఎంబీఏ కోర్సులతో పాటు పీజీ డిప్లొమాలో బీఎల్‌ఐఎస్సీ, ఎంఎల్‌ఐఎస్సీ సహా పలు సర్టిఫికేట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

డిగ్రీ ప్రవేశాలకు ఇంటర్ విద్యను పూర్తి చేసి ఉండాలి. పోస్ట్ గ్రాడ్యూయేషన్ కోర్సుల్లో MA, MSc, Mcom ఉన్నాయి. ఈ కోర్సుల్లో చేరాలంటే గ్రాడ్యూయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఇవి కూడా తెలుగు, ఇంగ్లీష్ మీడియాల్లో ఉన్నాయి. ఇక లైబ్రేరియన్ సైన్స్ తో పాటు పలు రకాల డిప్లోమా కోర్సులు కూడా యూనివర్శిటీ ఆఫర్ చేస్తోంది.

యూజీ (డిగ్రీ) కోర్సులు (3 సంవత్సరాలు / 6 సెమిస్టర్లు):

కోర్సులు : బీఏ, బీకాం, బీఎస్సీ (సీబీసీఎస్ విధానం). అర్హత: ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత, లేదా తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) / నేషనల్ ఓపెన్ స్కూల్ నుండి ఇంటర్ పూర్తి చేసిన వారు అర్హులు. పాలిటెక్నిక్ 3 ఏళ్ల డిప్లొమా లేదా ఐటీఐ 2 ఏళ్ల డిప్లొమా చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

బీఎస్సీ కోర్సులో చేరాలనుకునే వారు ఇంటర్‌లో సైన్స్ సబ్జెక్టులు చదివి ఉండాలి. ఫీజు: మొదటి సంవత్సరం రూ. 3,200, ద్వితీయ సంవత్సరం రూ. 3,000, తృతీయ సంవత్సరం రూ. 3,000 ఉంటుంది. సైన్స్ విద్యార్థులకు ల్యాబ్ ప్రాక్టికల్ ఫీజు అదనంగా ఉంటుంది (సైన్స్ సబ్జెక్టులకు రూ. 1,600, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్‌కు రూ. 800 చొప్పున, కంప్యూటర్ అప్లికేషన్స్‌కు రూ. 4,000 చొప్పున చెల్లించాలి).

పీజీ (మాస్టర్స్) కోర్సులు (2 సంవత్సరాలు / 4 సెమిస్టర్లు):

ఎంఏ కోర్సులు (ఫీజు ఏడాదికి రూ. 5,300) : ఎకనామిక్స్, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. తెలుగు, హిందీ, ఉర్దూ కోర్సులకు డిగ్రీలో సదరు భాషను సెకండ్ లాంగ్వేజ్ లేదా ఆప్షనల్‌గా చదివి ఉండాలి. ఎంఏ జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్ / ఎంకాం: ఏడాదికి ఫీజు రూ. 7,800.

ఎమ్మెస్సీ (M.Sc) కోర్సులు : మ్యాథమెటిక్స్ (ఫీజు రూ. 7,800), బోటనీ (ఫీజు రూ. 15,300), కెమిస్ట్రీ (ఫీజు రూ. 18,300), ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ (ఫీజు రూ. 15,300), ఫిజిక్స్ (ఫీజు రూ. 15,300), జూలాలజీ (ఫీజు రూ. 15,300). సంబంధిత సబ్జెక్టులతో బీఎస్సీ పూర్తి చేసిన వారు వీటికి అర్హులు.

లైబ్రరీ సైన్స్, డిప్లొమా అండ్ సర్టిఫికెట్ కోర్సులు:

  • బీఎల్ఐఎస్సీ (BLISC): ఒకే ఏడాది కోర్సు. విశ్వవిద్యాలయం నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్ కల్పిస్తారు (ఫీజు రూ. 5,300).
  • ఎమ్మెల్ఐఎస్సీ (MLISC): బీఎల్ఐఎస్సీ లో 40 శాతం మార్కులతో పాసైన వారు అర్హులు (ఫీజు రూ. 10,300). పీజీ డిప్లొమా కోర్సులు (1 ఏడాది):

దరఖాస్తు విధానం…

అర్హులైన అభ్యర్థులు https://www.braouonline.in/ వెబ్ సైట్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి. ఇందుకు ఆగస్టు 7వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఈలోపే నిర్ణయించన అప్లికేషన్ ఫీజును చెల్లించుకోవాలి.

ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే సమయంలో స్టడీ సెంటర్లను జాగ్రత్తగా ఎంచుకోవాలి. మీకు దగ్గరగా, అనుకూలంగా ఉండే ప్రాంతాల వివరాలను వెబ్ సైట్ లో చూడొచ్చు. డిగ్రీ కోర్సుల్లో కూడా అనేక కాంబినేషన్లు ఉన్నాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వీటిని ఎంచుకోవచ్చు.కోర్సులను బట్టి ఫీజులు ఉంటాయి. ఈ వివరాలను అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.

ఏదైనా సందేహాలు ఉంటే హెల్ప్ డెస్క్ నంబర్లు 040-23680222 / 333 / 444 / 555 లేదా 7382929570 ను సంప్రదించవచ్చు. ఉచిత సమాచారం కోసం టోల్ ఫ్రీ 18005990101 (ఉదయం 8:00 నుండి రాత్రి 8:00 గంటల వరకు) నెంబర్ అందుబాటులో ఉంటుంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More