BRAOU Bed Notification 2026 : ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవాలనుకునే అభ్యర్థులకు డా.బి.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU) మంచి అవకాశం కల్పించింది. విశ్వవిద్యాలయం 2026-27 విద్యాసంవత్సరానికి గాను బీఎడ్ (ఓడీఎల్ - ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్) ప్రవేశాల అర్హత పరీక్ష నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 24వ తేదీని ఆఖరి గడువుగా నిర్ణయించినట్లు విశ్వవిద్యాలయ అధికారులు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

అభ్యర్థులు విశ్వవిద్యాలయ అధికారిక పోర్టల్ www.braouonline.in ద్వారా మాత్రమే తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. జనరల్ అభ్యర్థులకు ప్రవేశ పరీక్ష ఫీజుగా రూ.1,000 నిర్ణయించగా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులకు రాయితీ కల్పించారు. వీరు రూ.750 ఫీజును ఆన్‌లైన్ ఫ్రాంచైజీ కేంద్రాల ద్వారా చెల్లిస్తే సరిపోతుంది.
ఆగస్టు మొదటి వారంలో (ఆగస్టు 2న) రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన అన్ని పరీక్షా కేంద్రాల్లో ఈ బీఎడ్ అర్హత పరీక్షను నిర్వహిస్తారు. అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే 040-23680333 హెల్ప్‌లైన్ నంబరులో సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
- సాధారణ ఫీజుతో దరఖాస్తుకు ఆఖరి తేదీ : 24-07-2026
- రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తు గడువు : 26-07-2026
- హాల్ టికెట్ల డౌన్‌లోడ్ ప్రారంభం : 29-07-2026
- ప్రవేశ పరీక్ష నిర్వహణ తేదీ : ఆగస్టు మొదటి వారం (ఆగస్టు 2)
- ఫలితాల విడుదల, ర్యాంక్ కార్డుల డౌన్‌లోడ్ : ఆగస్టు రెండో వారం
- అడ్మిషన్ కౌన్సెలింగ్ ప్రక్రియ : ఆగస్టు రెండో వారం నుంచి మొదలవుతుంది.
కోర్సు కాలవ్యవధి కనీసం 2 విద్యాసంవత్సరాలు, గరిష్టంగా 4 విద్యాసంవత్సరాలుగా ఉంటుంది. ఈ కోర్సు పూర్తిగా తెలుగు మీడియంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. పరీక్షలు, అసైన్‌మెంట్లు, రికార్డులు అన్నీ తెలుగులోనే రాయాల్సి ఉంటుంది.రెండేళ్ల కోర్సుకు గాను మొత్తం రూ.40,000 ట్యూషన్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.
ఈ పరీక్షను పూర్తిగా ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) పద్ధతిలో నిర్వహిస్తారు. పరీక్ష మొత్తం 100 మార్కులకు 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో ఉంటుంది.ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మినహా మిగిలిన అన్ని కేటగిరీల అభ్యర్థులకు క్వాలిఫైయింగ్ మార్కులుగా 35 మార్కులను నిర్ణయించారు.
{{/usCountry}}ఈ పరీక్షను పూర్తిగా ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) పద్ధతిలో నిర్వహిస్తారు. పరీక్ష మొత్తం 100 మార్కులకు 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో ఉంటుంది.ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మినహా మిగిలిన అన్ని కేటగిరీల అభ్యర్థులకు క్వాలిఫైయింగ్ మార్కులుగా 35 మార్కులను నిర్ణయించారు.
{{/usCountry}}