BRAOU MCA Admissions 2026 : అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో MCA ప్రవేశాలు - దరఖాస్తు గడువు పొడిగింపు

BRAOU MCA Admissions 2026 : డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎంసీఏ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ గడువును అక్టోబర్ 10వ తేదీ వరకు పొడిగించారు. 

Published on: Sep 30, 2026, 12:44:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

BRAOU MCA Admissions 2026 : హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (MCA) కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే ఈ గడువు ఈనెల 28వ తేదీతో ముగియగా… అధికారులు గడువు పొడిగించారు. ఈ మేరకు ప్రకటన జారీ అయింది.

అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ఎంసీఏ ప్రవేశాలు
అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ఎంసీఏ ప్రవేశాలు

2026-27 విద్యా సంవత్సరానికి గానూ ఎంసీఏ ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే చివరి తేదీని అక్టోబర్ 10, 2026 వరకు పొడిగించినట్లు విశ్వవిద్యాలయ అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. సాంకేతిక విద్యను అభ్యసించాలనుకునే అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.

విద్యా అర్హతలు….

ఎమ్‌సీఏ ప్రవేశ పరీక్షకు హాజరుకావాలనుకునే అభ్యర్థులు నిర్దేశిత విద్యా అర్హతలు కలిగి ఉండాలి. అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ స్థాయిలో తప్పనిసరిగా గణితం ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. అలాగే తమ బ్యాచిలర్ డిగ్రీ (సాధారణ డిగ్రీ)లో కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలని నిబంధన విధించారు.

కోర్సు వివరాలు, ప్రవేశ పరీక్ష విధానం, ఇతర పూర్తి సమాచారం కోసం అభ్యర్థులు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్ www.braouonline.in ను సందర్శించవచ్చు. సాంకేతిక సమస్యలు లేదా దరఖాస్తు సంబంధిత సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవడానికి వర్సిటీ ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు 040-23680222, 040-23680333 లేదా 040-23680555 నంబర్లను సంప్రదించి సమాచారం పొందవచ్చని అధికారులు తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు గడువు ముగిసేలోగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More