BRAOU Admissions 2026 : అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ ప్రవేశాలు - మరోసారి దరఖాస్తుల గడువు పొడిగింపు

BRAOU UG PG Admissions 2026 : డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఆన్‌లైన్ అడ్మిషన్ల గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించారు. 

Published on: Sep 10, 2026, 13:55:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

BRAOU UG PG Admissions 2026 : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) నుంచి మరో ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ యూజీ (UG), పీజీ (PG), డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే గడువును ఈ నెల 30 (సెప్టెంబర్ 30, 2026) వరకు పొడిగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో అడ్మిషన్లు
అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో అడ్మిషన్లు

కోర్సుల వారీగా వివరాలు…

ఈ నోటిఫికేషన్ లో భాగంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులైన బీఏ , బీకామ్ , బీఎస్సీ లతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులైన ఎంఏ , ఎంకామ్, ఎంఎస్సీ , ఎంబీఏ , బీఎల్ఐఎస్సీ , ఎమ్ఎల్ఐఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు. వీటితో పాటు పలు రకాల డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులు కూడా సెప్టెంబర్ 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు.

బీఎస్సీ కోర్సులో చేరాలనుకునే వారు ఇంటర్‌లో సైన్స్ సబ్జెక్టులు చదివి ఉండాలి. ఫీజులు చూస్తే…. మొదటి సంవత్సరం రూ. 3,200, ద్వితీయ సంవత్సరం రూ. 3,000, తృతీయ సంవత్సరం రూ. 3,000 ఉంటుంది. సైన్స్ విద్యార్థులకు ల్యాబ్ ప్రాక్టికల్ ఫీజు అదనంగా ఉంటుంది. (సైన్స్ సబ్జెక్టులకు రూ. 1,600, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్‌కు రూ. 800 చొప్పున, కంప్యూటర్ అప్లికేషన్స్‌కు రూ. 4,000 చొప్పున చెల్లించాలి.

2017 నుండి 2025 మధ్య కాలంలో అడ్మిషన్ పొంది…. ఇప్పటివరకు ట్యూషన్ ఫీజు చెల్లించలేకపోయిన అభ్యర్థులు సెప్టెంబర్ 30 నాటికి తమ ఫీజును చెల్లించవచ్చు.నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లేదా తెలంగాణ ఆన్‌లైన్ (TS Online) కేంద్రాల ద్వారా ఈ ఫీజు సులభంగా చెల్లించవచ్చని అధికారులు స్పష్టం చేశారు.

అడ్మిషన్లు, ఫీజు చెల్లింపులకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు తమ సమీపంలో ఉన్న విశ్వవిద్యాలయ అధ్యయన కేంద్రాన్ని నేరుగా సంప్రదించవచ్చు. అలాగే యూనివర్సిటీ అధికారిక పోర్టల్ www.braouonline.in లేదా వెబ్‌సైట్ www.braou.ac.in లలో సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఏవైనా సమస్యలు లేదా సందేహాలు ఉంటే బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉచిత కాల్ సెంటర్ నంబర్ 18005990101 లేదా సమాచార కేంద్రం ఫోన్ నంబర్లు 040-23680 222 / 333 / 555 లలో సంప్రదించవచ్చని అధికారులు వెల్లడించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More