BRAOU Admissions : డిగ్రీ, పీజీ కోర్సుల్లో ఆన్ లైన్ అడ్మిషన్లు - NRIలకు కూడా ఛాన్స్! పూర్తి వివరాలు

BRAOU online admissions 2026 : అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి ఆన్‌లైన్‌ డిగ్రీ, పీజీ కోర్సుల ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్‌ఆర్‌ఐలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని వర్సిటీ తెలిపింది.

Published on: Sep 29, 2026, 13:30:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే ఉద్యోగులు, గృహిణులు, అలాగే దూరప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) తీపి కబురు అందించింది. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ వివిధ ఆన్‌లైన్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం విశ్వవిద్యాలయం అడ్మిషన్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆన్‌లైన్ ద్వారా అందించే కోర్సుల్లో చేరేందుకు ప్రవాస భారతీయులకు (NRI) కూడా అవకాశం కల్పిస్తున్నట్లు వర్సిటీ ప్రకటించింది.

అంబేద్కర్‌ ఓపెన్‌ వర్సిటీ ప్రవేశాలు
అంబేద్కర్‌ ఓపెన్‌ వర్సిటీ ప్రవేశాలు

ఏయే కోర్సుల్లో ప్రవేశాలు…?

  • బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ - B.Com (తెలుగు, ఇంగ్లీష్ మీడియం)
  • మాస్టర్ ఆఫ్ కామర్స్ - M.Com (ఇంగ్లీష్ మీడియం)
  • మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ - M.A తెలుగు
  • మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ - MBA (ఇంగ్లీష్ మీడియం)

ఈ ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌ల ప్రత్యేకత ఏమిటంటే.. ప్రపంచంలో ఏ మూల ఉన్న విద్యార్థులైనా, ఉద్యోగులైనా సరే ఇంటర్నెట్ ద్వారా నేరుగా అడ్మిషన్ పొందే సదుపాయం కల్పించారు. ఆసక్తి గల అభ్యర్థులు డిజిటల్ మాధ్యమం ద్వారానే తమ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయవచ్చు. అడ్మిషన్ మరియు ట్యూషన్ ఫీజులను ఆన్‌లైన్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ విధానాల ద్వారా సులభంగా చెల్లించే వెసులుబాటు కల్పించారు.

దరఖాస్తు విధానం…

ప్రవేశాలకు సంబంధించిన పూర్తి సమాచారంతో కూడిన ప్రాస్పెక్టస్‌ను యూనివర్సిటీ అధికారిక పోర్టల్స్ www.braouonline.in లేదా www.braou.ac.in లో అందుబాటులో ఉంచారు. కోర్సుల వివరాలు, అర్హతలు, ఫీజుల నిర్మాణం తెలుసుకోవడానికి విద్యార్థులు వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

అడ్మిషన్లకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నా, తగిన గైడెన్స్ కావాలన్నా వర్సిటీ ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు టోల్ ఫ్రీ నంబర్ 18005990101 కు ఫోన్ చేయవచ్చు. అలాగే హెల్ప్ డెస్క్ నంబర్లు 040-23680222, 040-23680333, 040-23680555 లను సంప్రదించి సమాచారం పొందవచ్చని అంబేద్కర్‌ ఓపెన్‌ వర్సిటీ యాజమాన్యం తెలిపింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More