...
...
Next Story

హైదరాబాద్ : మద్యం గ్లాస్‌ విషయంలో గొడవ - అన్నను చంపిన తమ్ముడు

హైదరాబాద్‌ సిటీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మద్యం గ్లాస్‌ కోసం విషయంలో జరిగిన గొడవ.. ఒకరి ప్రాణాలను బలి తీసుకుంది. భవనం పైనుంచి అన్నను తమ్ముడు తోసేశాడు. వెంటనే స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.

Published on: Jan 16, 2026, 15:55:26 IST
Advertisement

హైదరాబాద్‌లోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. మద్యం గ్లాస్ విషయంలో తలెత్తిన చిన్న వివాదం ఒకరి ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటనలో అన్న ప్రాణాలు కోల్పోగా… తమ్ముడు అరెస్ట్ అయ్యాడు. భవనం పైనుంచి తోసేయటంతో ఈ ఘటన జరిగింది.

గ్లాస్ విషయంలో గొడవ…

అన్నను చంపిన తమ్ముడు
అన్నను చంపిన తమ్ముడు

ప్రాథమిక వివరాల ప్రకారం…. ఒక కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు నివాసంలో ఉంటారు. సంక్రాంతి పండుగ వేళ బుధవారం అర్ధరాత్రి సమయంలో అన్నదమ్ములు ఇద్దరూ తమ నివాసం ఉంటున్న భవనంపై మద్యం సేవించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలోనే మద్యం గ్లాస్ విషయంలో గొడవ జరిగింది. ఇది కాస్త మాట మాట పెరిగి పెద్దదిగా మారింది. మద్యం మత్తులో ఉన్న తమ్ముడు…. క్షణికావేశంలో తన అన్న రోహన్‌ను భవనం పైనుంచి కిందకు తోసేశాడు.

3 అంతస్తుల భవనంపై నుంచి కింద పడిపోయిన సోదరుడికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాటు చేశారు. మార్గమధ్యలోనే సోదరుడు ప్రాణాలు కోల్పోయాడు. ఘటానాస్థలికి చేరుకున్న నాచారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ కేసులో తమ్ముడైన లయనెల్‌ను అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. పండగ వేళ ఈ ఘటన వారి కుటుంబంలో కోలుకోలేని విషాదాన్ని నింపినట్లు అయింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe