...
...
Next Story

దయచేసి బయటకు రండి.. జూబ్లీహిల్స్‌లో రిగ్గింగ్ జరుగుతోంది : మాగంటి సునీత

జూబ్లీహిల్స్‌లో రిగ్గింగ్ జరుగుతోందని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత సంచలన ఆరోపణలు చేశారు. ఓటర్లను భయపెడుతున్నారని చెప్పారు.

Published on: Nov 11, 2025, 16:35:37 IST
Advertisement

జూబ్లీహిల్స్‌లో రిగ్గింగ్ జరుగుతోందని, ఓటర్లను భయపెడుతున్నారని మాగంటి సునీత అన్నారు. జూబ్లీహిల్స్‌లో పలుచోట్ల రౌడీషీటర్లు తిరుగుతున్నారని ఆరోపించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్యకు జూబ్లీహిల్స్‌లో ఏం పని అని అడిగారు.

మాగంటి సునీత
మాగంటి సునీత

మరోవైపు ఎన్నికల కమిషనర్‌ను మాగంటి సునీత రిక్వెస్ట్ చేశారు. ఎన్నికల కమిషనర్ దయచేసి బయట రండి అని, పరిస్థితి సమీక్షించాలని చెప్పారు. ఒక మహిళను ఇలా చేస్తుంటే కూడా చూస్తూ ఊరుకున్నారన్నారు. ఏది కరెక్ట్‌గా ఉందో చెప్పి, చేయించాలన్నారు. పోలీసులు కూడా గొడవలు చేశారని ఆరోపించారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్‌ను హైదరాబాద్ సీపీ సజ్జనార్ పరిశీలించారు. డ్రోన్ల ద్వారా పోలింగ్ స్టేషన్ల వద్ద పరిస్థితి వీక్షించారు. దేశంలోనే తొలిసారి డ్రోన్‌ టెక్నాలజీ ద్వారా పోలింగ్‌ పర్యవేక్షణ చేస్తున్నట్టుగా తెలిపారు. జూబ్లీహిల్స్‌లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని, 150 డ్రోన్ కెమెరాలు ఉపయోగిస్తున్నామన్నారు.

పోలింగ్ కోసం పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని సౌత్ ఈస్ట్ డీసీపీ చంద్రమోహన్ చెప్పారు. కేంద్ర బలగాలతో కూడా భద్రత ఏర్పాటు చేశామన్నారు. 5 సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించి భద్రత పెంచినట్టుగా వెల్లడించారు. 'ఓటర్లు ఎవరైనా ఉన్నారా అని చెక్ చేస్తున్నాం. హోటల్ రూమ్స్, లాడ్జిల్లో తనిఖీ చేశాం. దొంగ ఓట్లు అనేది ఎక్కడా లేదు. ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయం చేసుకుంటున్నాం. గ్యాదరింగ్ జరిగింది అని, కొన్నిచోట్ల ఈవీఎంలు పని చేయడం లేదని, గొడవలు అవుతున్నాయని ​లలో తప్పుడు సమాచారం సర్క్యులేట్ చేస్తున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేవు. ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి.' అని సౌత్ ఈస్ట్ డీసీపీ చంద్రమోహన్ తెలిపారు.

మరోవైపు ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన స్థానికేతర ప్రజాప్రతినిధులపై ఈసీ కేసులు నమోదు చేసింది. కోడ్‌ ఉల్లంఘించిన వారిపై కేసులు పెట్టామని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. నియమావళి ఉల్లంఘించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను గుర్తించామన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనధికారికంగా పోలింగ్‌ బూత్‌ల వద్ద ఉన్నారని తెలిపారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe