Musi Rejuvenation Project : మూసీ తొలిదశకు లైన్ క్లియర్ - రూ.7,055 కోట్లతో పనులు, అలైన్‌మెంట్‌లో కీలక మార్పులు!

Musi River Rejuvenation Project : మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై క్యాబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ.7,055 కోట్లతో మొదటి దశ పనులు ప్రారంభం కానున్నాయి. ప్రజల ఆస్తులకు నష్టం కలగకుండా అలైన్‌మెంట్‌లో మార్పులు చేయాలని సబ్ కమిటీ అధికారులను ఆదేశించింది.

Published on: May 9, 2026, 07:39:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Musi River Rejuvenation Project : మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ పనులకు లైన్ క్లియర్ అయింది. మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్ వేదికగా శనివారం ఈ ప్రాజెక్టుపై క్యాబినెట్ సబ్ కమిటీ కీలక సమావేశాన్ని నిర్వహించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఉన్నత స్థాయి అధికారులతో కలిసి ప్రాజెక్టు పురోగతిపై సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు అలైన్‌మెంట్, నిధుల సమీకరణ మరియు నిర్మాణ గడువుపై క్యాబినెట్ సబ్ కమిటీ స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది.

కేబినెట్ సబ్ కమిటీ భేటీ
కేబినెట్ సబ్ కమిటీ భేటీ

అలైన్‌మెంట్‌లో మార్పులు…

ఈ ప్రాజెక్టు కేవలం ఒక నిర్మాణ కాంట్రాక్ట్ మాత్రమే కాదని, ఇది నగరవాసులందరి సామాజిక బాధ్యత అని క్యాబినెట్ సబ్ కమిటీ స్పష్టం చేసింది. “ప్రజల ఆస్తులకు, నివాసాలకు కనీస నష్టం కూడా కలగకూడదన్నదే మా ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం. అందుకే ఉన్న నిర్మాణాలపై అతి తక్కువ ప్రభావం పడేలా అలైన్ మెంట్ లో మార్పులు చేయాలని అధికారులను ఆదేశించాం” అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

రూ. 7,055 కోట్లతో తొలి దశ పనులు..

మూసీ మొదటి దశ పనుల కోసం సుమారు 7,055 కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. ఈ భారీ ప్రాజెక్టుకు అవసరమైన ఆర్థిక వనరుల కోసం ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ADB)తో జరిపిన చర్చలు సఫలమైనట్లు తెలిపింది.

ఏడీబీ నుంచి నిధులు సమకూర్చుకునే ప్రక్రియ దాదాపు ఖరారైంది. మొదటి దశలో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుండి బాపుఘాట్ వరకు ఉన్న ఐదు కిలోమీటర్ల మేర పనులను వెంటనే ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ ప్రాంతంలో ఎటువంటి జనావాసాలు లేకపోవడంతో పనులను వేగవంతం చేయడం సులభతరం కానుంది.

టార్గెట్… డిసెంబర్ 2027

మూసీ నదిలో నీటి నిల్వను పెంచడంతో పాటు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అత్యాధునిక 'రబ్బర్ డ్యామ్' నమూనాలను పరిశీలిస్తున్నారు. ఇవి నదిలోని నీటి మట్టాన్ని నియంత్రించడమే కాకుండా పర్యాటకులను ఆకర్షించడానికి దోహదపడతాయి. 2026 ఆగస్టు నాటికి అన్ని రకాల అనుమతులు పూర్తి చేసి, డిసెంబర్ 2027 నాటికి ఈ బృహత్తర ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

నార్సింగి నుంచి గౌరెల్లి వరకు మొత్తం 55 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించనున్నారు. దీనితో పాటు మురుగు నీటి శుద్ధి కేంద్రాలు (STPs) మరియు వరద నియంత్రణ గోడల నిర్మాణంలో అత్యున్నత ప్రమాణాలు పాటించాలని మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. ఇందుకోసం ఐఐటి (IIT), జెఎన్ టియూ (JNTU) వంటి ప్రతిష్టాత్మక సంస్థల సాంకేతిక సహకారాన్ని తీసుకోనున్నట్లు మంత్రులు వెల్లడించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More